విశాఖలో రూ 3 కోట్లు నకిలీ కరెన్సీ పట్టివేత







*కాకాని నగర్ లో అర్ధరాత్రి పట్టుకున్న పోలీసులు*


*పోలీసులు అదుపులో ఇద్దరు నిందితులు*


*వివరాలు గోప్యంగా ఉంచుతున్న వైనం*


విశాఖలో మూడు కోట్లు విలువైన నకిలీ కరెన్సీ పోలీసులకు దొరికింది. సోమవారం అర్ధరాత్రి పోలీసుల నైట్ రౌండ్స్ తనిఖీల్లో భాగంగా ఈ కరెన్సీని పట్టుకున్నారు. ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల కాకాని నగర్ ప్రాంతంలో శ్రీ కట్టల మాదిరిగానే తెల్లని పేపర్లు కట్టలు కట్టి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. ఆ నకిలీ కరెన్సీ ని ఆటోలో తరలిస్తున్న ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. దొంగ నోట్లు ముద్రించే ముఠాకి చెందిన వ్యక్తులుగా పోలీసులు గుర్తించారు. రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దొంగ నోట్ల ముఠా నకిలీ కరెన్సీని ముద్రించి జనాలు లోకి చలామణి చేసేందుకు ప్లాన్ వేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. విశాఖపట్నంలో గడిచిన కొంతకాలంగా ఈ దొంగ నోట్ల ముఠా ప్రభావం ఎక్కడ కాన రాలేదు. కాగా ఇప్పుడు ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో ఆయా పార్టీల అభ్యర్థులు ఓటర్లకు ఎరవేసేందుకు ఓటుకు నోటు పంచే ప్రక్రియలో భాగంగా కొన్ని కోట్ల రూపాయలు చేతులు మారే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ దొంగ నోట్ల నుంచి చాలామంది చేసేందుకు కొన్ని ముఠాలు చేసినట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉండగా పోలీసులు ఈ విషయంలో స్పష్టత ఇచ్చేందుకు విముఖత చూపుతున్నారు. వాస్తవాలు వెల్లడించేందుకు మొహం చాటేస్తున్నారు. ఈ నోట్లు అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు ముద్రిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అందుకే ఈ కేసు వివరాలను పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై శాంతి భద్రతల విభాగం వెస్ట్ ఎసిపి అన్నెపు నరసింహమూర్తిని వివరణ కోరగా ఈ కేసు కు సంబంధించి పలు కోణాల్లో విచారణ జరుగుతుందని, పూర్తి వివరాలు మీడియా సమావేశం పెట్టి వెల్లడిస్తామని ఆయన స్పష్టం చేశారు.

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

బొబ్బిలి ఎంఎల్ఏ పిలుపు మేరకు వరద బాధితులకు విరాళాలు ఇచ్చిన సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ జవాన్లు

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,