Adudam Andhra: నేడు విశాఖలో సీఎం జగన్ పర్యటన..
అమరావతి..
వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు విశాఖపట్నంలో పర్యటించనున్నారు.. ఆడుదాం – ఆంధ్రా ఫైనల్స్ లో గెలిచిన విజేతలకు ట్రోఫీ అందజేయనున్నారు..
దీని కోసం పీఎం పాలెం క్రికెట్ స్టేడియంలో భారీ ఏర్పాట్లు చేసింది ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ).. సాయంత్రం 5.45 గంటలకు మధురవాడ హిల్ నెంబర్ 3 కి హెలిప్యాడ్ కు చేరుకోనున్న సీఎం.. 6 గంటలకు PM పాలెం స్టేడియంలో క్రికెట్ అభిమానులను కలుసుకుని, క్రీడాకారులను అభినందనలు తెలుపుతారు.. ఆడుదాం ఆంధ్రా ఫైనల్స్ క్రికెట్ వీక్షించడంతో పాటు కొంత సేపు క్రికెట్ ఆడే అవకాశం ఉంటుంది.. ఇక, రాత్రి 8.35 గంటల సమయంలో విశాఖపట్నం
నుంచి తిరుగు ప్రయాణం కానున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. కాగా, రాష్ట్రవ్యాప్తంగా 50 రోజుల పాటు పండుగ వాతావరణంలో ఉత్సాహంగా సాగిన 'ఆడుదాం ఆంధ్రా' క్రీడా పోటీలు తుది ఘట్టానికి చేరుకున్నాయి. విశాఖ సాగర తీరంలో ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు..