విశ్వ హిందూ పరిషత్ - కర్నూలు జిల్లా.
పత్రిక ప్రకటన: *హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూ అటవీశాఖ చేస్తున్న ఆర్థిక దోపిడిని అరికట్టాలి* .
పర్యావరణ పరిరక్షణ పేరిట అటవీశాఖ హిందూ ఆలయాలకు వెళ్లే భక్తుల నుంచి చేస్తున్న ఆర్థిక దోపిడీని నిరసిస్తూ హిందువులు తిరుగుబాటు చేయాలనీ *బజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్ తూముకుంట ప్రతాప్ రెడ్డి* పిలుపునిచ్చారు. శ్రీశైల శివ దీక్ష అన్న ప్రసాద సేవా సమితి ఆధ్వర్యంలో కర్నూల్ కొండారెడ్డి బురుజు దగ్గర ఈరోజు (24/2/24) నిర్వహించిన నిరసన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న *విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు గోరంట్ల రమణ* మాట్లాడుతూ ఇప్పటికే శ్రీశైలానికి వెళ్లే మార్గంలో నాలుగు చెక్ పోస్టుల వద్ద వాహనాలు సుమారు రూ.200, శ్రీశైలంలో సాక్షి గణపతి, హటకేశ్వరం క్షేత్రాల వద్ద పార్కింగ్ రుసుము రూ.50, ఇష్టకామేశ్వరి అమ్మవారిని దర్శించుకోవాలంటే రూ.1000, రుద్రకోటీశ్వరుని క్షేత్రానికి వెళ్లాలంటే వాహనానికి రూ.300 వసూలు చేస్తున్నారు. ఇవి చాలవని ఏకంగా శ్రీశైలానికి కాలినడకన వెళ్లే భక్తుల నుంచి రూ.10 అటవీశాఖ వసూలు చేయడం దుర్మార్గమైన ఆలోచన అని దుయ్యబట్టారు. *బిజెపి రాష్ట్ర నాయకులు కగ్గొలు హరీష్ బాబు* మాట్లాడుతూ ఇలాగే చూస్తూ ఊరుకుంటే భవిష్యత్తులో శ్రీశైలానికి కాలినడకన వెళ్లాలంటే వేల రూపాయలు చెల్లించాల్సిన పరిస్థితి రాబోవడం ఖాయమని,అందుకే అటవీశాఖ ఆర్థిక దోపిడిపై తిరుగుబాటు చేయాలని,ఆలయాలకు వెళ్లే అన్ని పర్యావరణ రుసుములను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. *శివదీక్ష గురు స్వామి గోవిందరాజులు* మాట్లాడుతూ అటవీ శాఖ అక్రమ వసూళ్ల ను రద్దు చేసేంతవరకు పోరాడుతామని డిమాండ్ చేశారు. ఈ నిరసన ధర్నా కార్యక్రమంలో హిందూ ఎస్సీ ఎస్టీ పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు మల్లెపోగు ప్రతాప్, బజరంగ్ దళ్ నాయకులు నీలి నరసింహ, విశ్వహిందూ పరిషత్ నాయకులు గోవిందరాజులు, నాగరాజు, బజరంగ్దళ్ నాయకులు తెలుగు భగీరథ, హరి కృష్ణ, సురేష్ ప్రకాష్ సింగ్, బాబురావు అయ్యన్న,చంద్ర, శివదీక్ష గురు స్వామి రవి గౌడు, హిందూ చైతన్య వేదిక నాయకులు రాజేష్ శర్మ, బిజెపి నాయకులు ప్రవీణ్ యాదవ్, గణేశ్ తదితరులు పాల్గొన్నారు