భారత ఉప రాష్ట్రపతికి ఆత్మీయ వీడ్కోలు

విశాఖపట్నం , ఫిబ్రవరి 22 : భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్ కు ఐ.ఎన్.ఎస్ డేగాలో రాష్ట్ర గవర్నర్, నేవీ అధికారులు, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు ఆత్మీయ వీడ్కోలు పలికారు.గురువారం మిలాన్ వేడుకల్లో పాల్గొన్న అనంతరం ఆయన మధ్యాహ్నం 12.30 గం.లకు ఐఎన్ఎస్ డేగాకు చేరుకున్నారు.


 అక్కడ ఉప రాష్ట్రపతికి రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్, తూర్పు నావికాదళ అధికారి వైస్ అడ్మిరల్ రాజేష్ పెండార్కర్, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలు నాయుడు, శాసన సభ్యులు పిజివిఆర్ నాయుడు (గణబాబు), పోలీస్ కమీషనర్ డా.ఎ.రవిశంకర్, నేవీ కమోడోర్ దిలీప్ సింగ్, చీఫ్ ఆఫ్ స్టాఫ్ సమీర్ సక్సెనా, రెవెన్యూ డివిజనల్ అధికారి హుస్సేన్ సాహెబ్ తదితరులు ఘనంగా వీడ్కోలు పలికారు. అనంతరం ఉప రాష్ట్రపతి భారత వైమానిక దళ ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం 12.42 గం.లకు ఢిల్లీకి బయలుదేరి వెళ్ళారు.