నేటి మధ్యాహ్నం కౌంట్ డౌన్ స్టార్ట్

 

GSLV F14 Launch: రేపు జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌-14 ప్రయోగం.. నేటి మధ్యాహ్నం కౌంట్ డౌన్ స్టార్ట్


భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) షార్‌ కేంద్రంలోని రెండో ప్రయోగ వేదిక నుంచి రేపు (శనివారం) సాయంత్రం 5.35 గంటలకు జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌-14 రాకెట్‌ను ప్రయోగించేందుకు సిద్ధం అయ్యారు..


ఇవాళ (శుక్రవారం) మధ్యాహ్నం 2.05 గంటల నుంచి 27.30 గంటల కౌంట్‌డౌన్‌ అనంతరం జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌-14 రాకెట్‌ను ప్రయోగించనున్నారు. మొత్తం 2,272 కిలోలు బరువు కలిగిన ఇన్‌శాట్‌-3 డీఎస్‌ ఉపగ్రహాన్ని భూమికి 36 వేల కిలో మీటర్ల ఎత్తులోని భూస్థిర కక్ష్యలో ప్రవేశ పెట్టేలా ఇస్రో శాస్త్రవేత్తలు ఈ ప్రయోగాన్ని డిజైన్‌ చేసినట్లు తెలిపారు. ఇది షార్‌ కేంద్రం నుంచి 92వ ప్రయోగం కాగా.. జీఎస్‌ఎల్‌వీ సిరీస్‌లో 16వ ప్రయోగం పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో క్రయోజనిక్‌ ఇంజిన్లు తయారు చేసుకుని చేస్తున్న 10 వ ప్రయోగం కావడం విశేషం అని ఇస్రో శాస్త్రవేత్తలు వెల్లడించారు..

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

ఫ్లాష్ ఫ్లాష్..... ఘోర రోడ్డు ప్రమాదం

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,