Vijayawada: సీపీఎస్ ఉద్యోగుల చలో విజయవాడకు అనుమతి లేదు: డీసీపీ
విజయవాడ: సీపీఎస్ ఉద్యోగులు ఆదివారం నిర్వహించతలపెట్టిన చలో విజయవాడకు అనుమతులు లేవని డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. నగరంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా సీపీఎస్ ఉద్యోగుల కార్యక్రమానికి అనుమతులు ఇవ్వలేమన్నారు..
చలో విజయవాడకు పోలీసుల నుంచి ముందస్తు అనుమతులు లేనందువల్ల ఎవరూ విజయవాడకు రావొద్దని సూచించారు. నగరంలో సెక్షన్ 30, 144 అమల్లో ఉన్నాయని తెలిపారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు చలో విజయవాడలో పాల్గొనవొద్దని సూచించారు. పోలీసు నిబంధనలు ఉల్లంఘించి పాల్గొంటే అరెస్టులు తప్పవని స్పష్టం చేశారు..