వంశీకృష్ణ కు ప్రాణ హాని ఉంది రక్షణ పెంచాలి
కాంగ్రెస్ప్రి నాయకురాలు ప్రియాంక దండి
ఎంపీ ఎంవివి సత్యనారాయణ శాసనమండలి సభ్యులు వంశీ కృష్ణ శ్రీనివాస్ ని ఇంటికి వెళ్లి కొడతా అనడం చాలా దారుణమని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక దండి అన్నారు. వైసీపీ పార్టీ కోసం ఆస్తులు తరగబెట్టుకొని పార్టీని బలోపేతం చేసిన వ్యక్తి వంశీ అని, అలాంటి వ్యక్తికి సమూచిత స్థానం ఇవ్వకుండా భూ కబ్జా దారులు,లిక్కర్ మాఫియా,ఇసుక మాఫియా,రౌడీలకు వైసీపీ కొమ్ము కాస్తోందని,వైసీపీ రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తోందని,ఎంవివిని ఓడించమని వంశీ అభిమానులకు అభిమానులకు పిలుపునివ్వడంతో ఎంవివి తట్టుకోలేకపోతున్నారని, నియోజకవర్గంలో ఆయన సామాజిక వర్గం మరియు అభిమానులు చాలా పెద్ద సంఖ్యలో ఉండడంతో ఎంపీకి నష్టం జరుగుతుందని భావించి వంశీ కృష్ణ శ్రీనివాస్ కు ఎంపీ ప్రాణ హాని తలపెట్టచ్చని ఆయనకు ప్రభుత్వం మరింత భద్రత కలిపించాలని ఆమె డిమాండ్ చేసారు. పార్టీలకు అతీతంగా వంశీ కృష్ణ శ్రీనివాస్ కు అండగా నిలవాలని ఆమె కోరారు.