AP: ఇసుక, మైనింగ్, మద్యం అక్రమార్జన సొమ్ముతో YCP ఎన్నికల బరిలోకి దిగుతోందని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఆరోపించారు. 'రాష్ట్రంలో అడ్డగోలుగా ఇసుకను దోచేస్తోంది. అలాగే నకిలీ మద్యం విక్రయించి అమాయకుల ప్రాణాలను హరిస్తోంది. దీనిపై అధికారులు కూడా మౌనంగా ఉండటం బాధాకరం. వైసీపీ ప్రభుత్వం ప్రజా క్షేమాన్ని విస్మరించింది. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని తరిమి కొట్టండి' అని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.