కోల్‌కతా: ఐపీఎల్ 2024లో భాగంగా తన తొలి మ్యాచ్‌లో హైదరాబాద్ పోరాడి ఓడింది.
అత్యంత ఉత్కంఠగా జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా 4 పరుగుల తేడాతో నెగ్గింది. 209 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 204 పరుగులు చేసింది. ఓపెనర్లు మయాంక్ అగర్వాల్ (32: 21 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్స్), అభిషేక్ శర్మ (32: 19 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) తొలి వికెట్‌కు 60 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ తర్వాత క్లాసెన్ (63: 29 బంతుల్లో) విశ్వరూపం ప్రదర్శించాడు. కడవరకు నిలిచి మ్యాచ్‌ను గెలిపించే ప్రయత్నం చేసినప్పటికీ వికెట్ కోల్పోవడంతో మ్యాచ్ కోల్‌కతా వశమైంది.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 208 పరుగులు చేసింది. తొలుత సాల్ట్ (54: 40 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధశతకంతో మెరవగా, చివర్లలో రస్సెల్ (64*: 25 బంతుల్లో 7 సిక్స్‌లు, 3 ఫోర్లు) విశ్వరూపం ప్రదర్శించాడు. రమణ్‌దీప్ సింగ్ (35), రింకూ సింగ్ (23) విలువైన పరుగులు చేశారు. హైదరాబాద్ బౌలర్లలో నటరాజన్ మూడు వికెట్లు పడగొట్టగా, మార్కండే రెండు వికెట్లు తీశాడు. .....