*ముస్లిం సోదరులకు పవిత్రమైన రంజాన్ మాసం ప్రారంభమైంది
.*
మంగళవారం తెల్లవారుజాము నుంచి ఉపవాస దీక్షలు చేపట్టనున్నారు. సోమవారం సాయంత్రం దేశవ్యాప్తంగా నెలవంక కనిపించడంతో రంజాన్ మాసం ప్రారంభమైనట్లు మతపెద్దలు ప్రకటించారు.
ప్రత్యేక ప్రార్థనల కోసం ఇప్పటికే మసీదులు ముస్తాబయ్యాయి. ముఖ్యంగా హైదరాబాద్ పాతబస్తీ సందడిగా మారింది.
ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు సీఎంలు జగన్ మోహన్ రెడ్డి, రేవంత్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.
రంజాన్ మాసంలో ముస్లింలు కఠోర ఉపవాస దీక్షలు, ప్రార్థనలు చేస్తారని, ఇది ఆదర్శవంతమైన జీవనానికి ప్రేరణ ఇస్తుందని పేర్కొన్నారు. వేడుకలను సుఖసంతోషాలతో నిర్వహించుకోవాలని చెప్పారు.