*ఎన్నికల వేళ సుప్రీంకోర్టు కీలక నిర్ణయం*
సార్వత్రిక ఎన్నికలకు తొలి నోటిఫికేషన్ విడుదలైన
రోజే కీలక పరిణామం చోటు చేసుకుంది.
ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఉచిత హామీలు ఇస్తున్న తీరుపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. త్వరలోనే దీన్ని లిస్ట్ చేస్తామని
వెల్లడించింది.
రాజకీయ పార్టీలు ఇచ్చే వాగ్దానాల పై చర్యలు తీసుకునేలా ఎన్నికల కమిషన్ ని ఆదేశించాలంటూ
న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ్ పిల్ దాఖలు
చేశారు.