CBI:25వేల కేజీల డ్రగ్స్.. సంధ్య ఆక్వా పరిశ్రమలో సీబీఐ దాడులు..

 CBI:25వేల కేజీల డ్రగ్స్.. సంధ్య ఆక్వా పరిశ్రమలో  సీబీఐ దాడులు..



మూలపేట: కాకినాడ జిల్లా యు కొత్తపల్లి మండలం మూలపేటలో ఉన్న సంధ్య ఆక్వా ఎక్స్‌పోర్ట్స్‌ పరిశ్రమలో సీబీఐ దాడులు చేపట్టింది. శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి ఏడుగురు సీబీఐ అధికారుల బృందం వివిధ భాగాల్లో తనిఖీలు చేశారు..


ఇప్పటికే పరిశ్రమలో పనిచేస్తున్న సిబ్బంది, కూలీల నుంచి వివరాలు సేకరించారు. ల్యాబ్‌ను పరిశీలించి ఫోరెనిక్స్ బృందాన్ని పిలిపించారు. వైజాగ్ నుంచి ఫోరెన్సిక్‌ బృందం పరిశ్రమకు చేరుకుంది. ల్యాబ్‌లో ఉన్న వివిధ శాంపిల్స్ సేకరించి విశాఖకు తరలించినట్లు సమాచారం.


బ్రెజిల్‌ నుంచి 25వేల కేజీల మాదకద్రవ్యాల కంటెయినర్‌ సంధ్య ఆక్వా ఎక్స్‌పోర్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరుతో బుక్‌ అయి విశాఖ చేరుకున్న విషయం తెలిసిందే. ఇంటర్‌పోల్‌ అప్రమత్తం చేయడంతో రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా సంధ్య ఆక్వా ఎక్స్‌పోర్ట్స్‌కు సంబంధించి పలు చోట్ల తనిఖీలు నిర్వహిస్తున్నారు.

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

బొబ్బిలి ఎంఎల్ఏ పిలుపు మేరకు వరద బాధితులకు విరాళాలు ఇచ్చిన సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ జవాన్లు

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,