టాటా ఏసీ వ్యాన్ను ఓ లారీ ఢీకొట్టింది.


[4/4, 1:04 PM] Sai News9: విశాఖ పెందుర్తి అక్కిరెడ్డిపాలెంలో వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. టాటా ఏసీ వ్యాన్ ను ఢీ కొట్టిన లారీ. అక్కడక్కడే ముగ్గురు మృతి. మరో  10 మందికి తీవ్ర గాయాలు. మృతులంతా ప. గో.  జిల్లా కొవ్వూరుగా గుర్తించిన పోలీసులు....*పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది*

[4/4, 2:32 PM] Sai News9: *ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి.. మరో 10 మందికి తీవ్ర గాయాలు*


విశాఖ: పెందుర్తి అక్కిరెడ్డిపాలెంలో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదం లో ముగ్గురు మృతి చెందారు.


 టాటా ఏసీ వ్యాన్ను ఓ లారీ ఢీకొట్టింది.


దీంతో టాటా ఏసీ వ్యాన్లో ఉన్న ప్రయాణికులల్లో ముగ్గురు అక్కడక్కడే మృతి చెందారు. మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరంతా పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరుకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. పెందుర్తి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదంలో హనుమంతు ఆనందరావు (45).. హనుమంతు శేఖర్ రావు (15).. చింతాడి ఇందు (65)లు మృత్యువాత పడ్డట్టు పోలీసులు నిర్ధారించారు.