No title


 *కొవిషీల్డ్ సురక్షితమే.. ఆందోళన వద్దు: ఆస్ట్రాజెనెకా*


కొవిషీల్డ్ వ్యాక్సిన్ సురక్షితమైందేనని ఆస్ట్రాజెనెకా పేర్కొంది. 


కాగా.. ఈ వ్యాక్సిన్తో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని ఇటీవల ఆస్ట్రాజెనెకా అంగీకరించడంతో టీకా తీసుకున్న వారిలో ఆందోళన మొదలైంది. 


తాజాగా ఈ విషయంపై ఆస్ట్రాజెనెకా మళ్లీ స్పందించింది. 


కొవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్నవారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. 


ప్రయోగ పరీక్షల్లో కొవిషీల్డ్ మంచి ఫలితాలు ఇచ్చిందని పేర్కొంది.