ఈ రోడ్డు ప్రమాదం పై సమగ్ర దర్యాప్తు జరగాల్సిందే!.

 


ఈ రోడ్డు ప్రమాదం పై సమగ్ర దర్యాప్తు జరగాల్సిందే!. ఎందుకంటే మధురవాడ సమీపములోని సాయిరాం నగర్ లో ఉంటున్న గుమ్మడి మధు అనే వ్యక్తిపై గతంలో ఎన్నోసార్లు హత్యాయత్న ప్రయత్నాలు జరిగాయి. పి .ఎం. పాలెం పోలీస్ స్టేషన్లో ఇత ని పై కేసులు ఉండటమే గాక, ఇతను తనకు ప్రాణహాని ఉందని ఇచ్చిన ఫిర్యాదులు కూడా ఉన్నాయి. ఎలక్షన్ ముగిసిన వెంటనేఈ రోడ్డు ప్రమాదం జరిగిందంటే.... రాజకీయ హత్యలో భాగంగా,లారీ తో ఢీ కొట్టి హత్య చేసినట్లు పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ రోడ్డు ప్రమాదము పట్ల సమగ్ర విచారణ నిష్పక్షపాతంగా చేసినట్లయితే, మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు వస్తాయని ఆ ప్రాంత ప్రజలు తెలియజేస్తున్నారు.