రెచ్చగొడితే జైలుకే* *అస్త్రాలు ఝలిపిస్తున్న* *ఎన్నికల కమిషన్*


 *రెచ్చగొడితే జైలుకే*

*అస్త్రాలు ఝలిపిస్తున్న*

*ఎన్నికల కమిషన్*


కొందరు అభ్యర్థులు సెంటి మెంట్‌ను రెచ్చగొడితోనే ఓట్లు పడతాయని భావించి కులం, వర్గం, ప్రాంతం పేరుతో ఇష్టా రాజ్యంగా మాట్లాడుతున్నారు. 


ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలను అడ్డుకట్ట వేసేందుకు ఎన్నికల సంఘం నియమావళిలో కఠిన నిబంధనలు రూపొందించింది. 


ఎన్నికల్లో ఎవరైనా జాతి, మత, కుల, భాష, సమాజం పేరుతో రెచ్చగొడితే ఆర్‌పీ చట్టం-1951 సెక్షన్‌ 125, ఐసీసీ సెక్షన్‌ 153ఏ ప్రకారం మూడేళ్లు జైలుశిక్ష, జరిమానా విధిస్తారు. 


ఓటు కోసం మద్యం, డబ్బులు, ఇతర వస్తువులను తీసుకున్న వారిని కూడా నేరస్థులగానే పరిగణిస్తారు. 


ఐపీసీ సెక్షన్‌ 171బి, 171 ఈ, హెచ్‌ ప్రకారం లంచంగా పరిగణించి ఏడాది జైలు శిక్ష విధిస్తారు. 


ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో డబ్బు, మద్యం ప్రవాహంపై నిఘా పెంచారు. నజరానాలకు లొంగినా, ఓటర్లను ప్రలోభాలకు గురిచేసినా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.