ఫ్లాగ్ మార్చ్ నిర్వహించిన రాయచోటి పట్టణ పోలీసులు

 






అన్నమయ్య జిల్లా 

👮👮 *ఫ్లాగ్ మార్చ్ నిర్వహించిన రాయచోటి పట్టణ పోలీసులు*


 మే 13 తేదీన ఎన్నికల ముగిసిన విషయం అందరికీ విధితమే. రాష్ట్రవ్యాప్తంగా  జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.ఈ సందర్భంగా అన్నమయ్య జిల్లా ఎస్పీ కృష్ణారావు ఐపీఎస్ ఆదేశాల మేరకు సీఐ సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్సై లు భక్తవత్సలం, ఎం.లోకేష్ మరియు కేంద్ర బలగాలతో రాయచోటి నందలి గల శివాలయం వద్ద నుంచి బంగ్లా, బస్టాండ్, తానా,రవి హాల్ తదితర ప్రాంతాల యందు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసు వారు మాట్లాడుతూ జూన్ 4వ తారీఖున  ఫలితాలు వెలువడనున్న  నేపథ్యంలో రాయచోటి నియోజకవర్గం నందు పోలీస్ శాఖ   నిరంతరం అప్రమత్తంగా ఉందని అలాగే ముందస్తు చర్యలో భాగంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కేంద్ర సాయుధ బలగాలతో సంసిద్ధంగా ఉన్నామని తెలిపారు.కాబట్టి ప్రజలు ఆవేశానికి గాని పౌరుషానికి గాని వెళ్లి గొడవలు పడి కేసుల పాలు అయ్యి తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని ప్రజలను కోరారు.4వ తేదీ న జరిగే ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణం లో జరిగే లాగా నాయకులు, ప్రజలు సహకరించాలని కోరారు.