*స్టూడెంట్ సక్సెస్ సొసైటీ సేవలు విజయానికి దిక్సూచి*
సరైన ప్రణాళిక లేకుండా నేటి పోటీ ప్రపంచంలో విజయం సాదించాలంటే చాలా కష్టం.
ప్రతి విద్యార్ధి లక్ష్యాన్ని సాధించాలి అంటే దానికంటూ ఒక బలమైన ప్రణాళిక ఉండాలి. ఆ ప్రణాళిక లో భాగం గా న్యూస్ పేపర్లు,క రెంట్అఫైర్స్, అకాడమీ మెటీరియల్స్,ఉద్యోగ నోటిఫికేషన్లు సలహాలు మరియు సూచనలు అవసరం. ఇవన్నీ నిరుద్యోగ విద్యార్థులు కు ఎలా అందించాలి అనే ఆశయం తో వీటన్నిoటిని ఒకే చోట అందిందించే వేదికే *"స్టూడెంట్ సక్సెస్ సొసైటీ గ్రూప్"*
ఈ గ్రూప్ 2021 సంవత్సరం లో గౌరవనీయ విద్యావేత్త డా. కొచ్చెర్ల శంకర రావు ఆలోచన తో మొదలై తరువాత మరికొంత మంది అడ్మిన్ల సహాయం తో నేటికీ 4 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.
ఈ గ్రూప్ లో తెల్లవారగానే ప్రతి రోజు న్యూస్ పేపర్స్, వివిధ పోటీ పరీక్ష లకు సంబందించిన పిడిఎఫ్ మెటీరియల్స్ , కరెంట్ అఫైర్స్ లను వివిధ రిసోర్స్ ల నుండి సేకరించి పోస్ట్ చేయబడుతుంటాయి. ఇవే కాకుండా నిరుద్యోగుల కొరకు వివిధ ప్రభత్వ & ప్రైవేట్ జాబ్ నోటిఫికేషన్లు సమయానుసారం గా పోస్ట్ చేయబడతాయి.
విద్యార్థులకు వొచ్చిన సందేహాలను ఈ గ్రూప్ లో ఉన్న దేశావ్యాప్తంగా ఉన్న ప్రొఫెసర్స్ లేదా అడ్మిన్స్ ఎప్పటికి కప్పుడు సమస్యలను పరిష్కరించడం జరుగుతుంది.
దీని తో పాటు స్టూడెంట్ సక్సెస్ సొసైటీ మోటో "*అంతిమ లక్ష్యాన్ని చేరుకోవడానికి కృషి చేయండి* "
ఈ నినాదం నిరుద్యోగ యువత అభ్యున్నతి కి ఈ సంఘం ఎంతగానో తోడపడుతున్నది.
అంతేకాకుండా నిరుద్యోగ యువతకు గొప్ప బహుమతి అని పిలువబడే ఈ గ్రూప్ లో బ్యాంకింగ్, రైల్వే, గ్రూప్స్, సచివాలయం, నెట్ సెట్ విద్యార్థుల కు ఉపయోగపడేలా *వివిధ సేవ కార్యక్రమాలు* జరుగుతుంటాయి. అవి *కెరీర్ గైడెన్స్ మరియు ప్లానింగ్* సంబందించిన *వర్కుషాప్లు*. *ఎడ్యుకేషన్ & ఎంపవర్మెంట్* కార్యక్రమాలు.
*పర్యావరణ పరిరక్షణ* లో భాగం గా *మట్టి వినాయకుల వితరణ*,సాంఘీంక అవగాహన కార్యక్రమాలైన *మహిళా దినోత్సవ వేడుకలు*, మరియు *గ్రంథాలయాలో అవసరమైన పుస్తకాలను అందించడం* మొదలైనవి.
ఇటీవల కాలంలో వివిధ దాతల సహకారం తో 100 మంది ప్రిలిమ్స్ అర్హత కలిగిన గ్రూప్ 2 విద్యార్థులుకు 4000రూపాయలు విలువ చేసే గ్రూప్ 2 మెయిన్స్ అధ్యయన మెటీరియల్ వితరణ జరిగింది. 21మంది తో ప్రారంభమైన ఈ గ్రూప్ నేటికీ వేల మంది విద్యార్థులు కు సేవ అందిస్తూ ఉన్నది.
స్టూడెంట్ సక్సెస్ గ్రూప్ కి,శంకర్ రావు సార్ కి నా హృదయపూర్వక నమస్కారాలు . మొన్న అయిన కార్యక్రమంలో నేను భాగం అయినందుకు సంతోషిస్తున్నాను.మీరు నిర్వహించిన ఈ కార్యక్రమం మాలాంటి విద్యార్థులుకు ఎంతో ఉపయోగపడేవి.మీరు మీ బృందం చేత లబ్ధి పొందిన ఈ పోటీ పరీక్షల పుస్తకాలు, అలాగే మీ ఈ స్టూడెంట్స్ సక్సెస్ సొసైటీ వాట్సాప్ గ్రూప్ లో పెట్టుతున్న చాలా పత్రికలు, జాబ్ నోటిఫికేషన్లు,వివిధ పరీక్షల మెటీరియల్స్ గానీ మాకు మా పోటీపరిక్షల సన్నద్ధత కు ఎంతో మేలు చేకూరుస్తాయి.మీ ఈ కృషికి పెద్దలందరు విచ్చేసి వాళ్ళ అమూల్యమైన సమయాన్ని ఇచ్చి మాలో మరింత ప్రేరణ కల్గించారు.మీరు మీ సేవ దృక్పథంతో ఉన్నత శిఖరాలను ఎదగాలని కోరుకుంటున్నాను.మీ ఈ సేవ కార్యక్రమాలు ఇంకా వ్యాప్తి చెంది మీకు మరింత ఆత్మసంతృప్తి కలగాలని కోరుకుంటున్నాము.మీరు చేస్తున్న ప్రతి మంచికి మా ఈ కృతజ్ఞతలు మీతో ఎల్లప్పుడూ వుంటాయి.
నా పేరు జీ.యువశ్రీ . మాది పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట మండలం చెక్కాపురం అనే మారుమూల గ్రామం.నేను డా. బి.ఆర్. అంబేద్కర్ విశ్వవిద్యాలయం కు అనుసంధానం అయిన హెచ్.పి.ఎన్ కాలేజీ లో నా బి. ఏ డిగ్రీ పూర్తి చేసాను. నా మొబైల్ నెంబర్.9908901673.
స్టూడెంట్స్ సక్సెస్ సొసైటీ మాలాంటి ఎంతోమంది జీవితాల్లో వెలుగు నింపింది సొంతవారే సహాయం చేయని ఈరోజుల్లో ఎప్పటికప్పుడు ఎంతో విలువైన సమాచారాన్ని అనగ ఉద్యోగ నోటిఫికేషన్లు, పుస్తకాలు, మోడల్ పేపర్లతో పాటు సరైన మార్గదర్శకత్వం ఇస్తున్నటువంటి స్టూడెంట్స్ సక్సెస్ గ్రూప్ చైర్మన్ శంకర్ రావు సార్.మిగిలిన సభ్యులకు నా హృదయపూర్వక వందనాలు తేది:-27-07-2024 .నా జరిగిన మీటింగ్ లో నన్నయ్య యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ ముత్యాలనాయుడు గారు అధేయవిధంగా కలెక్టర్ శ్యాంప్రసాద్ సార్ వంటి ప్రముఖులు మంచి ప్రేరణ కలిగే అంశలు చెప్పారు డిల్లేశ్వర రావు. విజయనగరం జిల్లా . ఫోన్నంబరు :-8341946674
నేను గ్రూప్ 2 అభ్యర్థిని నేను నా స్నేహితురాలు చెప్పడంతో స్టూడెంట్ సక్సెస్ గ్రూప్ నందు జాయిన్ కావడం జరిగింది,ఎవరి పని వారిది అని బతుకుతున్న ఈ సమాజంలో నిస్వార్థం తో అందరికి ఉపయోగపడేలా అందరికి అవసరమైన సమాచారం ,మెటీరియల్ ని ఈ గ్రూప్ ద్వారా మాకు చేరవేసిన డాక్టర్.శంకరరావు మరియు వారి బృందానికి ధన్యవాదాలు,మేము కూడా మీతో పాటు సమాజానికి ఉపయోగపడేలా భాగస్వామ్యం అవుతామని గర్వంగా చెప్తున్నాం.మొన్న పార్వతీపురం లో గ్రూప్ 2 మెయిన్స్ అభ్యర్థులకు ఉచిత పుస్తకాల పంపిణీ కార్యక్రమం విజయవంతం అవ్వడం చాలా ఆనందనీయం
డి. వాసుదేవరావు గ్రూప్ 2 అభ్యర్థి
పార్వతీపురం మన్యం జిల్లా9490448162
స్టూడెంట్ సక్సెస్ గ్రూప్ కి, గ్రూప్అడ్మిన్ శంకర్ రావు సార్ కి నా హృదయపూర్వక నమస్కారాలు . నేను 1 సంవత్సరం క్రితం ఈ వాట్సాప్ గ్రూప్ లోచేరాను.అప్పటినుండి ఈ గ్రూపును ఫాలో అవుతున్నాను.ఈ గ్రూప్లో ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు అన్ని వార్తాపత్రికలు, ఉద్యోగం సంబంధించి pdf నాణ్యత గల మెటీరియల్, మునుపటి పేపర్లు,ప్రైవేటు మరియు ప్రభుత్వం గల ఉద్యోగుల నోటిఫికేషన్లు ఈ గ్రూపులో క్రమం తప్పకుండా చేరవేయడం చాలా ఆనందంగా ఉంది. మంచి ఆలోచనలతో పెట్టిన ఈ గ్రూపు అడ్మిన్ కు ధన్యవాదాలు. మరింత మంది నిరుద్యోగులకు ఈ వాట్సాప్ గ్రూప్ ఉపయోగపడాలని కోరుకుంటున్నాను.
పేరు: పోలినాటి ప్రసాద్ (B.sc)
___ ( నిరుద్యోగి )
చిరునామా :కాకినాడ
ఫోన్ : 99124 24855
నేను ఒక డీఎస్ అభ్యర్థిని, స్టూడెంట్స్ సక్సెస్ గ్రూప్ నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఐదవ సంవత్సరంలోకి అడుగుపెడుతుంది. ఈ నాలుగు సంవత్సరాల సమయంలో ఈ గ్రూపులో అన్ని రకాల పోటీ పరీక్షలకు ఉపయోగపడే అత్యుత్తమైన,నాణ్యమైన మెటీరియల్ అందించారు, నెలవారీ కరెంట్ అఫైర్స్, నమూనా ప్రశ్నాపత్రాల బ్యాంకులు, ఉద్యోగ అవకాశాల వివరాలు, ప్రభుత్వ దరఖాస్తుల వివరాలు, ఇంటర్వ్యూల వివరాలు పొందుపరిచారు. ఈ మధ్యకాలంలో గ్రూప్-2 పేద విద్యార్థులకు ఉచిత పుస్తకాల పంపిణీ చేశారు.ఈ విధంగా ఎంతోమంది అభ్యర్థులకు సరైన సమయంలో విద్య-ఉద్యోగ అవకాశాల సమాచారాన్ని అందించిన గ్రూప్ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ గ్రూపుని ముందుండి నడిపిస్తున్న డాక్టర్. కే.శంకర్రావు గారికి ప్రత్యేక ధన్యవాదములు. ఈ గ్రూపులో ఉన్న ప్రతి అభ్యర్థి వారి గమ్యాలను చేరుకోవాలని ఆశిస్తున్నాను. ఈ గ్రూప్ ఎక్కువ మంది అభ్యర్థుల ఆదరణ పొందాలని మరిన్ని సమాజాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని కోరుకుంటున్నాను.గ్రూప్ సభ్యురాలు -యమున