రోడ్డు ప్రమాదంలో గాయపడిన మహిళ చికిత్స పొందుతూ మృత్యువాత ఆచూకీ తెలిసినవారు తెలియజేయగలరు
విశాఖ జిల్లా నావెల్ డాక్ యార్డ్ పరిసర ప్రాంతంలో సోమవారం సాయంత్రం ఏడు గంటల సమయంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మల్కాపురం పోలీసులు తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
ఆ ప్రమాదంలో గుర్తు తెలియని మహిళకు గాయాలు కావడంతో హుటాహుటిన మెరుగైన వైద్యం నిమిత్తం కేజీహెచ్ ఆస్పత్రికి తరలించారు. ఆ మహిళ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందిందని తెలిపారు. ఫోటోలో కనిపిస్తున్న ఆమెను ఎవరైనా గుర్తించినట్లయితే డైలీ 100కి గాని మల్కాపురం పోలీస్ స్టేషన్ 9440796023,9440796035,08912577392కి సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు మల్కాపురం పోలీస్ స్టేషన్ సిబ్బంది.