*స్ట్రాంగ్ రూమ్ లను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్*
విశాఖపట్టణం, మే 21 ః ఏయూ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్‌లను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా. ఎ. మల్లికార్జున మంగళవారం సాయంత్రం తనిఖీ చేశారు. పార్లమెంటు నియోజకవర్గం స్ట్రాంగ్ రూమ్ తో పాటు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన స్ట్రాంగ్ రూమ్‌లను పోలీసు జాయింట్ కమిషనర్ ఫక్కీరప్పతో కలిసి తనిఖీ చేశారు. ప్రతి గదికీ వేసిన తాళాలను, సీళ్లను పరిశీలించారు. అక్కడ పరిస్థితులను గమనించారు. సీసీ కెమెరాల పనితీరు, వాటి ద్వారా రికార్డయ్యే మానిటరింగ్ రూమ్‌ను పరిశీలించారు. భద్రతా సిబ్బంది, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వారి వెంట స్వతంత్ర, రాజకీయ పార్టీల అభ్యర్థులు, ఆర్వోలు, ఇతర అధికారులు ఉన్నారు.
జారీ, సార్వత్రిక ఎన్నికల మీడియా కేంద్రం, విశాఖపట్టణం.