*ప్రశాంత వాతావరణంలో తిరుణాల నిర్వహించుకోవాలి*
*150 మందితో పోలీసులతో గట్టి బందోబస్తు*
సుండుపల్లె ప్రశాంత వాతావరణంలో తిరుణాల నిర్వహించుకోవాలని రాయచోటి రూరల్ సీఐ తులసీరామ్ తెలిపారు. సోమవారం రాత్రి నాగారపమ్మ తిరుణాల సందర్భంగా అన్నమయ్య జిల్లా ఎస్పి కృష్ణారావు ఆదేశాలతో డి.ఎస్.పి రామచంద్ర రావు ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు తెలిపారు. సుమారు 150 మంది పోలీసులతో బందోబస్తు కల్పించడం జరిగిందని తెలిపారు. ఏవైనా సమస్యలు వస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. తిరునాళ్లలో పరిసర ప్రాంతాల్లో మద్యం అమ్మకుండా గట్టి చర్యలు చేపట్టామన్నారు.