పాకిస్థాన్‌ టీ20 వరల్డ్ కప్ నుంచి ఎలిమినేట్



 పాకిస్థాన్‌ టీ20 వరల్డ్ కప్ నుంచి ఎలిమినేట్


టీ20 వరల్డ్ కప్ 2024లో దాయాది దేశం పాకిస్థాన్‌కు బిగ్ షాక్ తగిలింది. సూపర్-8 దశ నుంచి జట్టు నిష్క్రమించింది. 


శుక్రవారం ఫ్లోరిడాలోని లాడర్‌హిల్‌లో అమెరికా- ఐర్లాండ్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా తుడిచిపెట్టుకు పోవడంతో పాక్ ఆశలపై నీళ్లు చల్లింది. యూఎస్ఏ వర్సెస్ ఐర్లాండ్ మధ్య మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. 


దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది. పర్యవసానంగా 5 పాయింట్లలో యూఎస్ఏ జట్టు సూపర్-8 దశకు అర్హత సాధించింది. జూన్ 16న ఐర్లాండ్‌తో పాకిస్థాన్ తన చిట్టచివరి లీగ్ మ్యాచ్‌ను ఆడనుంది. 


ఆ మ్యాచ్‌లో విజయం సాధించినా ఆ జట్టు వద్ద 4 పాయింట్లు మాత్రమే ఉంటాయి. గ్రూప్-ఏలో ఇతర జట్లేవీ 5 పాయింట్లు సాధించే అవకాశం లేదు. కాబట్టి ఇప్పటికే 5 పాయింట్ల ఉన్న అమెరికా, 6 పాయింట్లతో ఉన్న భారత్ ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా సూపర్ -8లోకి అడుగుపెట్టాయి. 


కాగా ఫ్లోరిడాలోని లాడర్‌ హిల్‌లో యూఎస్ఏ-ఐర్లాం డ్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. మైదానం చిత్తడిగా ఉన్న కారణంగా కనీసం టాస్ కూడా పడకుండానే ఈ మ్యాచ్‌ను రద్దు చేయాల్సి వచ్చింది. 


నిర్దేశిత సమయం వేచి చూసిన తర్వాత కూడా మ్యాచ్ నిర్వహణకు అనుకూల పరిస్థితులు లేకపోవడంతో అంపైర్లు రద్దు చేశారు...