ఐపీఎస్‌ల బదిలీ.. విశాఖ సీపీగా శంకబ్రత బాగ్చి

 విశాఖ పోలీస్ కమిషనర్
*ఐపీఎస్‌ల బదిలీ.. విశాఖ సీపీగా శంకబ్రత బాగ్చి*


ఏపీలో పలువురు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారుల్ని ప్రభుత్వం బదిలీ చేసింది. 


ముగ్గురు సీనియర్‌ ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. 


ప్రస్తుతం ఏపీఎస్‌పీ బెటాలియన్‌ అదనపు డీజీ అతుల్‌ సింగ్‌ను ఏసీబీ డీజీగా నియమించింది. 


విశాఖ సీపీగా ఉన్న రవిశంకర్‌ అయ్యన్నార్‌ను సీఐడీ అదనపు డీజీగా, అలాగే.. శాంతిభద్రతల అదనపు డీజీ శంకబ్రత బాగ్చిని విశాఖ సీపీగా నియమిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.