రోడ్డు ప్రమాదంలో తండ్రి కుమారులకు గాయాలు

 




*రోడ్డు ప్రమాదంలో తండ్రి కుమారులకు గాయాలు*

 

 దొరవారిసత్రం మండల పరిధిలోని   కుప్పారెడ్డిపాలెం గ్రామ సమీపంలో     మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలు చోటు చేసుకున్నాయి.  స్థానికులు వివరాలు మేరకు వాకాడు గ్రామానికి చెందిన పుచ్చలపల్లి కిరణ్ కుమారుడు సందీప్ లు అత్తగారి ఊరైన ఉగ్గు మూడికి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో కుప్పారెడ్డిపాలెం సమీపంలో  సూళ్లూరుపేట నుండి నాయుడుపేట వైపు వెళుతున్న కారు అదుపుతప్పి ఢీకొంది.  ఈ ప్రమాదంలో తండ్రి కిరణకు, కుమారుడు సదీప్ కు తీవ్ర గాయాలు తగిలాయి.వీరిని చికిత్స నిమిత్తం  108 లో  నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడనుండి మెరుగైన వైద్యం కొరకు  స్థానికులు తెలిపారు.  విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు  నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.