రేపు అసెంబ్లీకి రాకూడ‌ద‌ని వైసీపీ పార్టీ నిర్ణ‌యం

 

*రేపు అసెంబ్లీకి రాకూడ‌ద‌ని వైసీపీ  పార్టీ నిర్ణ‌యం*


శాసనసభ స్పీకర్‌గా టీడీపీ సీనియర్‌ ఎమ్మెల్యే అయ్యన్నపాత్రుడు ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యారు. 


రేపు ఆయ‌న స్పీకర్‌గా బాధ్యతలు స్వీక‌రించనున్నారు. 


అయితే స్పీకర్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి దూరంగా ఉండాలని వైసీపీ నిర్ణయించింది. 


సభాపతిగా ఎన్నికైన వ్యక్తిని అధికార, విపక్ష నేతలు స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టడం సంప్రదాయంగా వస్తోంది. 


అయితే వైసీపీ అధినేత జగన్ రేపు ఉదయం వ్యక్తిగత పర్యటన కోసం పులివెందులకు వెళ్లనున్నారు.