విశాఖ జిల్లా పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతం మల్కాపురం పోలీస్ స్టేషన్ లో నూతన సర్కిల్ ఇన్స్పెక్టర్ గాఎస్.విద్యాసాగర్ ఆదివారం బాధ్యతలు చేపట్టారు. గతంలో న్యూ పోర్టు పోలీస్ స్టేషన్లో లా అండ్ ఆర్డర్ విభాగంలో బాధ్యతలు నిర్వహించారు. అలాగే మల్కాపురం పోలీస్ స్టేషన్లో ట్రాఫిక్ విభాగంలో సిఐగా బాధ్యతలు నిర్వహించారు సిటీ పోలీస్ కమిషనర్ రవిశంకర్ అయ్యన్నార్ ఆదేశాలు మేరకు విఆర్ నుంచి మల్కాపురం పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా ఆయన బాధ్యతలు చేపట్టారు.