రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ ద్వారకాతిరుమలరావును

 


అమరావతి: రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ ద్వారకాతిరుమలరావును  కార్యాలయంలో కలిసి అభినందించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర  అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు. 

👉 రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి చంద్రబాబు తొలి ప్రాధాన్యమైన శాంతి భద్రతల అంశాలపై డిజిపి తో చర్చించిన పల్లా శ్రీనివాస్. 

👉 బాధితులకు న్యాయం జరిగేలా చట్టపరంగా తీసుకోవాల్సిన అంశాలపై చర్చ

👉 గంజాయి నిర్మూలనకు పోలీసు శాఖ పరంగా తీసుకునే చర్యలకు పార్టీ పరంగా తాము పూర్తిగా అండదండలు అందిస్తామని డీజీపీకి స్పష్టం చేసిన పల్లా శ్రీనివాస్

👉 ముఖ్యమంత్రి చంద్రబాబు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూటమి జాతీయ పార్టీ భారతీయ జనతా పార్టీ మూడింటి ఏకైక లక్ష్యం పూర్తిస్థాయిలో ప్రజలకు భద్రత భరోసా కల్పించాలనేదే లక్ష్యమని మరో మారు డీజీపీకి వివరణ. 

👉 పోలీస్ స్టేషన్ లో చిట్ట చివరి అధికారి వరకు ఈ లక్ష్యం కోసం పనిచేసేలా ద్వారకాతిరుమలరావు మార్గ దర్శనం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేసిన పల్ల.

👉గత ప్రభుత్వంలో రాజకీయ ప్రేరేపిత కేసుల జాబితా అన్ని పోలీస్ స్టేషన్లోనూ తయారు చేయాల్సిందిగా సూచించిన పల్లా శ్రీనివాస్

👉వీటిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునేందుకు వీలుగా ప్రతి కేసు పుట్టు పూర్వోత్తరాలు అన్ని అందులో పొందుపరచాలని కోరిన శ్రీనివాస్.