పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు
చిలకలూరిపేటటౌన్, న్యూస్ 9 రిపోర్టర్
పట్టణంలోని చౌత్రా సెంటర్లో గల పొట్టి శ్రీరాములు చౌక్ వద్ద ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహానికి ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం పురస్కరించుకొని పట్టణ ఆర్యవైశ్య సంఘ నాయకులు శుక్రవారం పూలమాలలు వేసినివాళులర్పించారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
ఉమ్మడి తమిళనాడు రాష్ట్రంలో పలు రకాలుగా అవహేళనకు గురి అవుతూ, అవమానంతో జీవిస్తున్న ఆంధ్రులు ఈరోజు తల ఎత్తుకొని తిరగడానికి కారణం అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగమని కొనియాడారు. అమరజీవి పొట్టి శ్రీరాములు 57 రోజులు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి అసువులు బాసారని ఆయన త్యాగ ఫలితమే భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అవతరించిందని వారు తెలిపారు.
అదేవిధంగా రాజధానిలో అమరజీవి పొట్టి శ్రీరాములు భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఆయన జ్ఞాపకార్థం స్మృతి వనం ఏర్పాటు చేసి ఆయన త్యాగానికి తగిన గుర్తింపును పాలకులు తీసుకురావాలని వారి డిమాండ్ చేశారు. అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం కమిటీలో రాష్ట్రంలో ఉన్న ఆర్యవైశ్య కులస్తులకు కూడా తగిన ప్రాధాన్యత కల్పించాలని కోరారు.. నవంబర్ 1 వ తేదీని గతంలో వలె ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం గా ప్రభుత్వం ప్రకటించడం పట్ల వారు హర్ష వ్యక్తం చేశారు.
0 అనంతరం పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద అల్పాహారాన్ని ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు కొప్పురావూరి నాగేశ్వరరావు సెక్రటరీ దామిశెట్టి నాగేంద్రం చీఫ్ ఆర్గనైజర్ మురికిపూడి ప్రసాద్, ఆర్యవైశ్య సంఘ నాయకులు రాచుమల్లు సూర్యరావు ,గ్రంధి వీరయ్య, గుర్రం సాంబశివరావు చేవూరి కృష్ణమూర్తి కొత్త కోటేశ్వరరావు, కే రమేష్, సుబ్రహ్మణ్యం, తదితరులు పాల్గొన్నారు.