వీధి కుక్కలు దాడిలో రెండేళ్ల బాలుడు ప్రేమ‌కుమార్ మృతి

 న్యూస్ నైన్ విజయవాడ


ఇలాంటి సంఘ‌ట‌న జ‌ర‌గ‌టం దుర‌దృష్ట‌క‌రం: ఎంపి కేశినేని శివ‌నాథ్కుక్క‌లబెడ‌దతొల‌గించేందుకుఆదేశాలు......విజ‌య‌వాడ‌:



 జ‌గ్గ‌య్య‌పేట నియోజ‌క‌వ‌ర్గం పెనుగంచిప్రోలు గ్రామంలో తుఫాన్ కాల‌నీలో  వీధి కుక్కలు దాడిలో రెండేళ్ల బాలుడు ప్రేమ‌కుమార్ మృతి చెందిన విష‌యం తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురి అయిన‌ట్లు విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ సోమ‌వారం విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న లో తెలిపారు. మృతి చెందిన ప్రేమ‌కుమార్ త‌ల్లిదండ్రుల‌కు త‌న సానుభూతి తెలియ‌ప‌ర్చారు. ఇలాంటి సంఘ‌ట‌న జ‌ర‌గ‌టం చాలా దుర‌దృష్ట‌క‌ర‌మ‌న్నారు. ఈ విష‌యం తెలిసిన వెంట‌నే మున్సిప‌ల్ శాఖ‌, పంచాయతీ అధికారులకు    గ్రామాల్లో కుక్క‌ల బెడ‌ద తొల‌గించాల‌ని ఆదేశించారు.    ఇక పై ఇలాంటి సంఘ‌ట‌న‌లు పున‌రావృతం కాకుండా వుండే విధంగా చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. వెట‌ర్న‌రీ, జిల్లా వైద్యాధికారుల‌తో సమిష్టి నిర్ణ‌యం తీసుకుని చ‌ర్య‌లు తీసుకోవాల్సిందిగా ఎంపి కేశినేని శివ‌నాథ్ కోరారు.