పాత గవర్నమెంట్ ఆసుపత్రి రోడ్ మలుపు పెంచాలి....
మురికిపూడి ప్రసాద్ చిలకలూరిపేట టౌన్ న్యూస్ 9 రిపోర్టెర్ వినియోగదారుల హక్కుల పరిరక్షణ ఫోరం పల్నాడు జిల్లా ఇన్చార్జి.
పట్టణంలోని పాత గవర్నమెంట్ హాస్పిటల్ మలుపు వద్ద ఇరుకుగా ఉండటం వల్ల, ఇటు భక్తులు, అటు వాహన చోదకులు పలు ఇబ్బందులకు గురవుతున్నారు..తాజాగా
ఒరిస్సా రాష్ట్రంకు చెందిన డీసీఎం వ్యాను పౌడర్ తయారి యంత్రంతో బాపట్లకు వెళ్లుచుండగా జీపీఎస్ ఆధారంగా వ్యాన్ డ్రైవర్ ఈ మార్గానికి రావటం జరిగింది. అయితే మలుపు తిప్పే క్రమంలో గుడి చుట్టూ ప్రదక్షిణ చేసే మహిళలు అడ్డు రావటంతో డ్రైవర్ వారిని తప్పించేందుకు వ్యాన్ పక్కకు తిప్పడంతో డీసీఎం వ్యాన్ ఎడమ వైపు వెనుక టైర్ కాలువలోకి దిగబడింది.
ఈ సందర్భంగా అక్కడ గుమికూడిన ప్రజలు రోడ్ మలుపు ఇరుకుగా వుండటంతో ఈ సంఘటన జరిగిందని, మలుపును పెంచినట్లయితే రాబోయే ప్రమాదాలు నివారించ వచ్చు అని వినియోగదారుల హక్కుల పరిరక్షణపురం ఫోరం ఇంచార్జ్ ప్రసాద్ సూచించారు