Skip to main content

Posts

Showing posts from February, 2025

..నా బిడ్డను కాపాడండి..... సీఎం సారు

 .....నా బిడ్డను కాపాడండి..... సీఎం సారు ......పలు హాస్పిటలకు తిప్పిన మెరుగు పడని తన బిడ్డ ఆరోగ్యం.... ప్రభుత్వం దాతలు ఆదుకోవాలని... టి సుండుపల్లి ఫిబ్రవరి 26  9న్యూస్  అన్నమయ్య జిల్లా సుండుపల్లి:- అనారోగ్యంతో బాధపడుతున్న తన కుమార్తె జ్యోతికి మెరుగైన వైద్యం అందించి కాపాడాలని కొప్పు సుజాత ప్రభుత్వం వారిని బుధవారం ఒక ప్రకటన ద్వారా వేడుకున్నారు. వివరాల్లో వెళ్తే.. సుండుపల్లె మండల పరిధిలోని దిగువ గుల్లవాండ్లపల్లి కు చెందిన కొప్పు  జ్యోతి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నది  గత నాలుగు సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు. కొప్పు సుజాత కు ముగ్గురు పిల్లలు కలరు. తల్లి కూలి పని చేసుకుంటూ ముగ్గురు పిల్లలను చదివించుకుంటూ జీవనం సాగించేది. ఇటీవలే తనకు  అనారోగ్య రీత్యా సమస్యలు రావడంతో కూలి పనికి వెళ్లడం కూడా మానేసింది. తన బంధువుల దగ్గర  నుంచి ఆరు లక్షల రూపాయలు అప్పు తీసుకొని ఏలూరు బెంగళూరు మొదలగు హాస్పిటల్లో చూపించగా  డాక్టర్లు మాట్లాడుతూ PNH పరోసిక్స్మల్ నాక్టర్నల్ హిమోగ్లోబిన్ వీక్నెస్ తలనొప్పి బ్రీతింగ్ ప్రాబ్లం రక్తం గడ్డ కట్టడం బ్యాక్ ...

ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉండగా వైన్, బార్ అండ్ రెస్టారెంట్ల్లో

 చిలకలూరిపేట లో కానరాని MLC ఎన్నికల కోడ్                  ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉండగా వైన్, బార్ అండ్ రెస్టారెంట్ల్లో క్యాటర్ మద్యం బాటిల్  మీద రూ.30 నుంచి 50 రూపాయలు వసూలు చేస్తున్నారు. దానికి తోడు  మహాశివరాత్రి పండుగ కావడంతో మద్యం ప్రియులు వైన్ షాపులపై ఎగబడడంతో విచ్చలవిడిగా దోపిడీకి తెర లేపారు. ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిసే జరుగుతుందన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. వైన్ షాపులు సిలు వేసినప్పటికీ ఎక్కడ మద్యం అమ్మకాలు నిలుపుదల చేయలేదు... దీనిని బట్టి ఎక్సైజ్ శాఖ అధికారుల పనితీరు ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు అని పలువురు విమర్శిస్తున్నారు.

హైవేపై వెళ్లే వారిని బెదిరించి డబ్బులు దొంగలించే నేరస్థులను పట్టుకున్న కృష్ణాజిల్లా కంకిపాడు పోలీసులు

 కృష్ణాజిల్లా,   *కృష్ణాజిల్లా, గన్నవరం సబ్ డివిజన్, కంకిపాడు సర్కిల్, కంకిపాడు పోలీస్ స్టేషన్*  *హైవేపై వెళ్లే వారిని బెదిరించి డబ్బులు దొంగలించే నేరస్థులను పట్టుకున్న కృష్ణాజిల్లా కంకిపాడు పోలీసులు*  నిందితులు వద్ద నుండి 10,000 రూపాయల నగదు మరియు సుమారు 6,50,000 విలువైన 5 మోటార్ సైకిల్ లను స్వాధీనం చేసుకున్నారు..  వివరాల్లోకి వెళితే ఈనెల 18వ తారీఖున పొద్దుటూరు గ్రామానికి చెందిన వ్యక్తి కంకిపాడు నుండి ప్రొద్దుటూరు తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో బండిపై వెళుతుండగా శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ వద్దకు వచ్చేసరికి వెనక నుండి ఐదుగురు వ్యక్తులు రెండు బైకులు పై వచ్చి ఇతనిని,ఆపి బెదిరించి ఇతని వద్ద ఉన్న పదివేల రూపాయల నగదును దొంగలించారని ఫిర్యాదు ఇచ్చారు.. ఈ ఫిర్యాదు పై కంకిపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడమైనది..  ఇటువంటి కేసు మళ్లీ జరగకుండా ఉండడానికి కంకిపాడు ఎస్ఐ సందీప్ గారు పోలీస్ స్టేషన్ సిబ్బందితో కలిసి ఒక టీం గా ఏర్పడి టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ అంశాలను ఆధారంగా చేసుకోవడం జరిగింది..  ఈరోజు అనగా 24 వ తారీకు రాబడిన సమాచారం మేరకు ఉదయం 9 గంటలకు కంకిపాడు మండ...

48 గంటలు మద్యం షాపులు మూసి ఉంచాలి

 *48 గంటలు మద్యం షాపులు మూసి ఉంచాలి* *కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే.బాలాజీ* మచిలీపట్నం :- ఈనెల 27వ తేదీన ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో జరిగే పట్టభధ్రుల ఎమ్మెల్సీ పోలింగ్ ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు  జిల్లా పరిధిలో అన్ని మద్యం దుకాణాలను 48 గంటలపాటు మూసివుంచే విధంగా ఆంధ్రప్రదేశ్ ఛీప్ ఎలక్ట్రోరల్ అధికారి ఉత్తర్వులు జారీచేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డీ కే బాలాజీ ఉత్తర్వులు జారీచేశారు.  ప్రజా ప్రాతినిధ్య చట్టం -1951 లోని  సెక్షన్ 135 సి ప్రకారం ఈసీఐ, ఏపీ చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లా పరిధిలో  మద్యం దుకాణాలను, బార్లను ఈనెల 25వ తేదీ సాయంత్రం 4.00 గంటల నుంచి 27వ తేదీ సాయంత్రం 4.00 గంటల వరకు డ్రై డేగా పాటించి తప్పనిసరిగా మద్యం దుకాణాలను మూసిఉంచాలని, ఉత్తర్వులను కచ్చితంగా అమలు చేసేందుకు జిల్లా ప్రొఫెషన్ ఎక్సైజ్ అధికారులను ఆదేశించినట్లు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆ ప్రకటనలో తెలిపారు.

తెలగ కాపు ప్రతినిధుల సమావేశం జరిగింది తెలగ సంక్షేమ సంఘం

  ప్రెస్ నోట్ :సాయంత్రం 4 గంటలకు  రాజమహేంద్రవరం బసవ తారకేశ్వర స్వామి ఫంక్షన్ హల్ లో తెలగ కాపు   ప్రతినిధుల సమావేశం జరిగింది. తెలగ సంక్షేమ సంఘం రాజమహేంద్రవరం అధ్యక్షులు రొక్కం వెంకట ప్రసాద్, కార్యదర్శి యర్నాగుల అధిబాబు ఆధ్వర్యంలో  సంక్షేమం అభివృద్ధి సదస్సు కార్యక్రమం లో   ప్రత్యేక ఆహ్వానం పై హాజరు అయిన ప్రముఖ సమాజాసేవకులు మాతృశ్రీ లక్ష్మి తెలగ కాపు సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు ఉత్తరాంద్ర ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ లీగల్ అడ్వైసర్, హ్యూమన్ రైట్స్ ఆఫన్స్ కంట్రోల్ కమిటీ సౌత్ ఇండియా కోఆర్డినేటర్ 6 స్టేట్స్ ఇంచార్జి న్యాయవాది డా.ఆకుల గణేష్ పాల్గున్నారు ఆయన మాట్లాడుతూ ప్రజలకు చట్టలపై అవగాహనా కలిగి ఉండాలని కాపు కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం మంజూరు చేస్తున్న సబ్సిడీ లోన్స్ నిరుద్యోగులు అందరూ సాధ్వినియోగ పరుచుకోవాలని డా. ఆకుల గణేష్ అన్నారు అదేవిధంగా  నిరుపేద కుటుంబాలకు సంబంధించి కాపు సామాజిక వర్గం తరుపున మూడు సెంట్లు భూమినీ లబ్ది దారులకు ఇల్ల పట్టాలను ప్రభుత్వం కల్పిస్తుంది అని గుర్తు చేసారు , పెందుర్తి సంక్షేమ సంఘం నిర్వహిస్తున్న మాట్రిమోనీ, బ్లడ్ డొనేష...

సుండుపల్లి మండలం చిన్న గొల్లపల్లి గ్రామపంచాయతీలో జరిగిన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన

 24-02-2025: సుండుపల్లి మండలం చిన్న గొల్లపల్లి గ్రామపంచాయతీలో జరిగిన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన గురించి బిజెపి సుండుపల్లి మండల అధ్యక్షులు ఎస్ వి రామన్ గౌడ్ మాట్లాడుతూ.  ఇది కేంద్ర ప్రభుత్వ పథకం. 2018 డిసెంబర్ 1 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. దీని కింద సాగు చేసే భూమి ఉన్న రైతులకు పంట పెట్టుబడి సాయం అందిస్తుంది. ఏడాదికి రూ. 6 వేలను ఈ స్కీమ్ కింద రైతులకు ఇస్తుంది. ఇక్కడ డబ్బులు నేరుగా లబ్ధిదారుల అకౌంట్లలోనే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) ద్వారా జమవుతాయి. రూ. 6 వేలను ఒకేసారి అందించదని గుర్తుంచుకోవాలి. ఇక్కడ విడతల వారీగా అందిస్తుంది. ప్రతి విడతకు రూ. 2 వేల చొప్పున ప్రతి 4 నెలలకు ఓసారి 3 విడతలుగా ఇస్తుందని చెప్పొచ్చు. ఇప్పటివరకు 18 విడతల డబ్బుల్ని విడుదల చేసింది. ఇప్పుడు 19వ విడత కోసం ఎదురుచూస్తున్నారు రైతులు. 18వ విడతలో 10.32 కోట్ల మంది లబ్ధిదారుల అకౌంట్లలో డబ్బులు పడ్డాయి. ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ లో పనిచేస్తున్న మన్సూర్, కూటమి నాయకులు కార్యకర్తలు రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

హైవే వెంచర్స్ నాల్గవ శాఖ నిన్న ఆదివారం నాడు ప్రారంభించారు

 హైవే వెంచర్స్ నాల్గవ శాఖ నిన్న nఆదివారం నాడు ఇసుకుతోట, విష్ణు హోండా షోరూమ్ ప్రక్కన సింహాద్రి హైట్స్ లో ప్రారంభించారు.ఈ సందర్భంగా హైవే వెంచర్స్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ అయిన డా. హేమారావు గారు మాట్లాడుతూ ఈ నాల్గవ శాఖ ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది అన్నారు . ఇంతటి అభివృద్ధికి కారణమైన కస్టమర్స్ మరియు మార్కెటింగ్ టీమ్ కి కృతజ్ఞతలు చెప్పారు

BREAKING: పాకిస్థాన్ను చిత్తు చేసిన భారత్*

 *BREAKING: పాకిస్థాన్ను చిత్తు చేసిన భారత్*  ఛాంపియన్స్ ట్రోఫీ: పాకిస్థాన్ పై భారత్ జైత్రయాత్ర కొనసాగుతోంది. విరాట్ సూపర్ సెంచరీతో ఆ జట్టుపై 6 వికెట్ల తేడాతో టీమ్ ఇండియా విజయకేతనం ఎగరేసింది. PAKను 241 పరుగులకే కట్టడి చేసిన భారత్.. ఆడుతూపాడుతూ 42.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ముద్దాడింది. రోహిత్ వెంటనే ఔటైనా గిల్, విరాట్, శ్రేయస్ విజయాన్ని అందించారు.

ఛాంపియ‌న్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం దుబాయ్ ఇంట‌ర్నేష‌న‌ల్ స్టేడియంలో జ‌రిగిన ఇండియా-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్

 *ప్ర‌చుర‌ణార్థం* *23-02-2024* ఇండియా-పాక్ మ్యాచ్ ను వీక్షించిన మంత్రి నారా లోకేష్‌, ఏసీఏ అధ్య‌క్షుడు, ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) విజ‌య‌వాడ :  ఛాంపియ‌న్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం దుబాయ్ ఇంట‌ర్నేష‌న‌ల్ స్టేడియంలో జ‌రిగిన ఇండియా-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ ను ఏసిఏ అధ్యక్షుడు, విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) ,విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తో వీక్షించారు. మంత్రి నారా లోకేష్,విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) టీమిండియా  జెర్సీ లు వేసుకుని మ్యాచ్ ను తిల‌కించారు.    వీరితో పాటు ఈ మ్యాచ్ ను వీక్షించిన వారిలో ఏసీఏ కార్య‌ద‌ర్శి రాజ్య‌స‌భ ఎంపి సానా స‌తీష్‌, డైరెక్ట‌ర్ సుకుమార్ వున్నారు.

విలువలతో కూడిన రాజకీయం చేస్తాను; కె.ఎస్ లక్ష్మణరావు

 విలువలతో కూడిన రాజకీయం చేస్తాను; కె.ఎస్ లక్ష్మణరావు రాజకీయ నాయకులు పోటీ చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఉపాధ్యాయ, కార్మిక, కర్షక, ప్రజా సమస్య పరిష్కారానికి ముందు ఉంటాను. న్యూస్9 చిలకలూరిపేట: పట్టణంలోని పెన్షనర్స్ అసోసియేషన్ హాల్లో పలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో అభ్యర్థి పిడిఎఫ్ కె.ఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ ఉపాధ్యాయ సమస్యలతో పాటు, ఆయా ప్రజా సంఘాల సమస్యలను మండలిలో ప్రస్తావించడమే కాకుండా పోరాటాల రూపంలో ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి న్యాయం చేశామన్నారు. దురదృష్టవశాత్తు రాజకీయ పార్టీలు పోటీ చేయడం చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుందన్నారు. కార్మిక అంగన్వాడి, ఆశా వర్కర్లు నిరుద్యోగుల సమస్యల చట్టసభలో వినిపించి వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానన్నారు. పిడిఎఫ్ ఎమ్మెల్సీలు గా తాము చట్టసభలో విలువలతో కూడిన రాజకీయం చేస్తున్నానని పేర్కొన్నారు. 2007 నుండి ఇప్పటి వరకు ప్రభుత్వం ఏదైనా రాజీ పడకుండా ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తున్నాను, నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా ఉంటామని ప్రజా సమస్యల పోరాటంలో ముందుంటామని విమర్శలకు తావు లేకుండా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని వివరించారు.

వెయ్యి మందికి మజ్జిగ పంపిణీ..

 కృష్ణాజిల్లా.. పెనమలూరు నియోజకవర్గం.. ఉయ్యూరు.. వీరమ్మ తల్లి తిరుణాలలో ఆఖరి రోజు కావడంతో పేనమలూరు ఐ న్యూస్ రిపోర్టర్ తుంగల ప్రదీప్, మరియు ఆకునూరుకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త మందాడ శరత్ బాబు, సహకారంతో వెయ్యి మందికి మజ్జిగ పంపిణీ..  విలేకరులు ఏర్పాటుచేసిన కార్యక్రమంలో శ్రీ వీరమ్మ తల్లి ఆలయ కమిటీ చైర్మన్ పారుపూడి వీర వెంకట ప్రసాద్.., నేరుసు గంగాధర్ రావు, పారుపూడి వెంకటేశ్వరరావు, పారుపూడి శీను, పలువురు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొనీ భక్తులకు మజ్జిగ పంపిణీ చేశారు. తిరునాళ్ళ లో మూడుసార్లు విలేకరులు ప్రసాదాలు పంపిణీ చేయడం హర్షణీయమని కమిటీ సభ్యులు కొనియాడారు.. ఈ కార్యక్రమంలో విలేకరులు ప్రైమ్ నైన్ శివ, రాజ్ న్యూస్ జానీ, విద్యార్థులు లక్కీ, చెర్రీ పాల్గొన్నారు..

ఎన్నికల కోడ్

 ఎన్నికల కోడ్   పేరుతో కూటమి ప్రభుత్వం వైస్సార్సీపీ నాయుకులు కార్యకర్తలపై కేసులు పెట్టటమేనా మీపని ప్రజలకు ఇచ్చిన హామీలు ఎప్పుడు మొదలు పెడతారో చెప్పారా గన్నవరం జడ్పీటీసీ అన్నవరపు ఎలిజబెత్ రాణి. ----------------------------------------కూటమి ప్రభుత్వం ఆధికారంలోకి వచ్చి 9 నెలలు పాటు వైస్సార్సీపీ నాయుకులు కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపటమే అభివృద్ది అనుకున్నారా, అని గన్నవరం జడ్పీటీసీ అన్నవరపు ఎలిజబెత్ రాణి అంటూ కానీ ఒక్కరు కూడా భయపడలేదు అన్నారు దానికి రుజువే గన్నవరం మాజీ యమ్ యల్ ఏ వల్లభనేని వంశీ మోహన్ గారిని విజయవాడ జైలులో చూడటానికి మాజీ ముఖ్యమంత్రి వైస్ జగన్ మోహనరెడ్డిగారు వస్తే ప్రజలు జైలు వద్దకు వేలాదిగా తరలి వచ్చారు.మారుచటి రోజు మిర్చి రేటు సమస్య పై జగన్ గారు గుంటూరు మార్కెట్ యార్డుకు వెళితే అక్కడ ప్రజలు వేలాదిగా రావటం చూసి కూటమి ప్రభుత్వం తట్టుకోలేక ఎన్నికల కోడ్ పేరుతో అక్కడకు రాని మాజీ మంత్రి పేర్ని నాని గారిపైనా ఇంకా చాలా మంది పైన కేసులు పెడుతున్నామని పోలీసులు ద్వారా భయపేట్టించటం చూస్తే కూటమి ప్రభుత్వం అభివృద్ది చేసే పరిస్థితి కనపడటం లేదని అర్ధం అవుతుందని ఎల...

అక్రమ కేసులో అరెస్ట్ అయిన గన్నవరం మాజీ శాసనసభ్యులు

 *అక్రమ కేసులో అరెస్ట్ అయిన గన్నవరం మాజీ శాసనసభ్యులు డాక్టర్ వల్లభనేని వంశీ మోహన్ గారిని ఆయన సతీమణి వల్లభనేని పంకజశ్రీ గారు నిన్న విజయవాడ సబ్ జైల్లో  మూలకత్ అవ్వడం జరిగింది  అనంతరం నియోజకవర్గ నాయకులు  వల్లభనేని పంకజశ్రీ గారి నుంచి  వల్లభనేని వంశీ మోహన్ గారి ఆరోగ్య యోగ క్షేమాలు అడిగి తెలుసుకోవడం జరిగింది...ఆయన ధైర్యంగా ఉన్నారు మీరు ఎవరు అధైర్యపడొద్దు త్వరలోనే ఆయన కడిగిన ముత్యం లాగా బయటికి వస్తారని నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటారని  నాయకులకు భరోసా ఇవ్వడం జరిగింది....*

వైద్యం వికటించి, కాలు చేయి పడిపోయిన పరిస్థితి

 కృష్ణా జిల్లా  పెనమలూరు నియోజకవర్గం   వైద్యం వికటించి,  కాలు చేయి పడిపోయిన పరిస్థితి ఉయ్యూరులో హోప్ హాస్పిటల్ లో చోటు చేసుకున్న ఘటన పమిడిముక్కల గ్రామానికి చెందిన గోవులపల్లి వెంకటేశ్వరరావు 45 సంవత్సరాలు కూలి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.  వారం రోజుల క్రితం స్కూటీపై వెళుతూ ప్రమాదవశాత్తు స్కిడ్  అయ్యి పడిపోగా అతన్ని ఉయ్యూరు హోప్ హాస్పిటల్ లో కుటుంబ సభ్యులు అడ్మిట్ చేయడం జరిగింది.  డాక్టర్ జి జ్యోతి వైద్యం లో నిర్లక్ష్యం చూపడమే కాకుండా, పేషెంట్ ని సకాలంలో మెరుగైన వైద్యం కొరకు,  న్యూరాలజిస్ట్ కి రిఫర్ చేయకపోగా, డాక్టర్ జ్యోతి వైద్యం చేస్తూ ఉండగా జి వెంకటేశ్వరరావుకి కాలు చేయి పడిపోయిన దారుణ సంఘటన చోటు చేసుకుంది.  ఈ విషయం తెలిసిన కుటుంబ సభ్యులు డాక్టర్ను సంప్రదించగా, నిర్లక్ష్య ధోరణిలో బాధితులపై మాట్లాడుతూ మీకు చేతనైంది చేసుకోండి పోయి అని దురుసుగా ప్రవర్తించిన యాజమాన్యం హాస్పటల్ యాజమాన్యం తీరుకు కుటుంబ సభ్యులు హాస్పిటల్ ముందు బైఠాయించారు.

డీజీపీ, పోలీస్ ఉన్నతాధికారులతో హోంమంత్రి అనిత సమీక్ష*

 *డీజీపీ, పోలీస్ ఉన్నతాధికారులతో హోంమంత్రి అనిత సమీక్ష* *మహిళల రక్షణ, బడ్జెట్ కేటాయింపుల అంచనాపై సమీక్ష* *మహిళల రక్షణకు స్పెషల్ వింగ్, ప్రత్యేక యాప్ ఏర్పాటు చేయాలని ఆదేశం* *హెల్ప్ డెస్కుల బలోపేతం, మౌలిక వసతులపై చర్చ* *మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల్లో కఠిన వైఖరి అవలంబించాలని ఆదేశం* *పోలీస్ శాఖలో బడ్జెట్ కేటాయింపులు, ప్రతిపాదనలపై చర్చ* మహిళల రక్షణ విషయంలో పోలీసులు కఠిన వైఖరి అవలంబించాలని హోంమంత్రి అనిత ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఇతర పోలీస్ ఉన్నతాధికారులతో హోంమంత్రి సమీక్ష నిర్వహించారు. మహిళల రక్షణ విషయంలో కూటమి ప్రభుత్వం స్పష్టమైన వైఖరి కలిగి ఉందని.. విద్య, సాధికారత, భద్రత విషయంలో రాజీ ఉండదన్నారు. మహిళల రక్షణ కోసం హెల్ప్ డెస్కుల ఏర్పాటు, అవసరమైన సిబ్బంది ఏర్పాటుపై చర్చించారు. 'సురక్ష' పేరుతో ప్రత్యేక యాప్ రూపకల్పనపై కీలక సూచనలు ఇచ్చారు. మహిళల రక్షణ కోసం స్పెషల్ వింగ్ ఏర్పాటు చేసి.. అవసరమైన సిబ్బంది ఏర్పాటు, వారికి ట్రైనింగ్ ఇవ్వాలని ఆదేశించారు. యాప్ రూపకల్పన మహిళా దినోత్సవమైన మార్చి 8 నాటికి పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మహిళ...

హైదరాబాద్ హైవే గుంటుపల్లి వద్ద ట్రాఫిక్ తో ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు

 ఎన్టీఆర్ జిల్లా   హైదరాబాద్ హైవే గుంటుపల్లి వద్ద ట్రాఫిక్ తో ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు   గుంటుపల్లి సెంటర్ వద్ద మెయిన్ రోడ్ లో లారీ కారు యాక్సిడెంట్ జరగడం ప్రధాన కారణం   కనుచూపు మేరకు కనపడని పోలీస్ అధికారులు   ట్రాఫిక్ తో ఇబ్బంది పడుతు   అసహనం వ్యక్తం చేస్తున్న ప్రయాణికులు

జరగనున్న గ్రాడ్యుయేటు ఎమ్. ఎల్. సి ఎన్నికల్లో ఉమ్మడి గుంటూరు కృష్ణ జిల్లాల కూటమి అభ్యర్థి

 27-2-2025 జరగనున్న గ్రాడ్యుయేటు ఎమ్. ఎల్. సి ఎన్నికల్లో ఉమ్మడి గుంటూరు కృష్ణ జిల్లాల కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ గారికి గ్రాడ్యుట్స్ ఓటు వేసి వారిని అత్యధిక  మెజారిటీతో గెలిపించాలని 53వ డివిజన్ కార్పొరేటర్ మహదేవ్  అప్పాజీరావు, 53వ డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షులు పులిచే రమేష్ బాబు, 53వ డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రావూరి సత్యనారాయణ  53వ డివిజన్లోని ఓటర్లను  కలిసి కూటమి అభ్యర్థికి ఓట్లు వేయవలసిందిగా కోరడం జరిగినది  ఇంకా డివిజన్ టిడిపి నాయకులు, జనసేన పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది

ఆలపాటి అనుభవం.. వ్యక్తిత్వంతో ఉపాధ్యాయవర్గానికి మంచే జరుగుతుంది - MLA బొండా ఉమ*

ఆలపాటి అనుభవం.. వ్యక్తిత్వంతో ఉపాధ్యాయవర్గానికి మంచే జరుగుతుంది - MLA బొండా ఉమ* *27వ తేదీన జరిగే పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికలో ఆలపాటి రాజేంద్రప్రసాద్ కు మంచి మెజారిటీ దక్కేలా బాధ్యతగల స్థానాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ పనిచేయాలి* ధి:21-2-2025 శుక్రవారం ఉదయం 9:30"గం లకు" విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 33వ డివిజన్ సత్యనారాయణపురం A.K.T.P  స్కూల్ నందు MLC ఎలక్షన్స్ లో ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి ఆలపాటి రాజేంద్రప్రసాద్ గారిని అఖండ మెజారిటీతో గెలిపించాలని ఉపాధ్యాయులకు ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు గారు అవగాహన కల్పించడం జరిగినది...  ఈ సందర్భంగా బొండా ఉమా గారు మాట్లాడుతూ :-కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ గారి పనితీరు, వ్యక్తితం గురించి వారికి వివరించారు, ఆలపాటి అన్నివేళలా ప్రజలకోసం అందుబాటులో ఉండే వ్యక్తని, ఆయన గెలుపుతో ఉపాధ్యాయవర్గానికి మంచే జరుగుతుందని... ఆలపాటి రాజేంద్రప్రసాద్ గారిని MLC గా గెలిపిస్తే ఈ రెండు ఉమ్మడి జిల్లాలు తో పాటు నవ్యాంధ్రప్రదేశ్ మొత్తం అభివృద్ధిలో ఈయన కూడా ఒక భాగస్వామ్యం అని, చదువుకున్నటువంటి వారి  గొంతును వినిపిస్తూ నిర...

ఫైబర్ నెట్ ఛైర్మన్ జీవీ రెడ్డి మీడియా సమావేశం.

 *ఫైబర్ నెట్ ఛైర్మన్ జీవీ రెడ్డి మీడియా సమావేశం.*   *ఏపీ ఫైబర్ నెట్ కు 78 వేల కి.మీ. ఆప్టికల్ కేబుల్ ఉంది..ఫైబర్ నెట్ కు ప్రతీ రోజు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.*   *దినేష్ కుమార్ ఐఏఎస్ ఆగస్టులో చార్జ్ తీసుకున్నారు..చార్జ్ తీసుకున్న తర్వాత ఒక్క రోజు కూడా ఫైబర్ నెట్ పై ఫోకస్ చేయలేదు.*   *గత అధికారులతో కుమ్మక్కు అయ్యారా అన్న సందేహం వస్తోంది.. మా ప్రభుత్వం వచ్చాక ఫైబర్ నెట్ కు ఒక్క రూపాయి రాలేదు.*   *ఒక్క కొత్త కనెక్షన్ ఇవ్వలేదు.. ముగ్గురు అధికారులకు నోటీస్ పిరియడ్ ఇవ్వాలి..సత్యరామ భరద్వాజ(చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్), సురేష్( బిజినెస్ హెడ్), శశాంక్ హైదర్ ఖాన్(ప్రొక్యూర్ మెంట్ ఆఫీసర్)  ముగ్గురు అధికారుల సేవలు ఫైబర్ నెట్ కు అవసరం లేదు.*   *గతంలో తొలగించిన వారిని ఇంత వరకు విధుల నుంచి టెర్మినేట్ చేయలేదు..కమిటీ నిర్ణయం తీసుకున్న తర్వాత ఆదేశాలు అమలు చేయడానికి అధికారులకు ఉన్న అభ్యంతరం ఏంటి?*   *ఫైబర్ నెట్ లో జీఎస్టీ సమస్య వచ్చింది..గత నెలలో మాకు రూ.377 కోట్ల జరిమానా విధించారు.*   *ఫైబర్ నెట్ సంస్థ ఇప్పటికే కష్టాల్లో ఉంది : ఫైబ...

గుంటూరు మిర్చియార్డుకు మాజీ సీఎం జగన్‌ గుంటూరు మిర్చియార్డుకు మాజీ సీఎం జగన్‌ గుంటూరు మిర్చి యార్డ్ వద్ద ఉద్రిక్తత

 *గుంటూరు మిర్చియార్డుకు మాజీ సీఎం జగన్‌* - మిర్చి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్న జగన్‌ - ఏపీలో రైతులు బతికే పరిస్థితి లేదు-వైఎస్‌ జగన్‌ - ఏ పంటకూ గిట్టుబాటు ధర దక్కడం లేదు - ఏపీలో ఏ ఒక్క రైతూ సంతోషంగా లేడు - రైతుల కష్టాలను చంద్రబాబు పట్టించుకోవాలి - లేదంటే రాబోయే రోజుల్లో రైతుల తరపున ఉద్యమం- వైఎస్  జగన్‌ AP: గుంటూరు మిర్చి యార్డ్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. మిర్చి రైతులను పరామర్శించేందుకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి రోడ్డు మార్గంలో వైసీపీ అధినేత జగన్ యార్డ్కు చేరుకున్నారు. జగన్ వస్తున్నారని తెలిసి భారీ సంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు వచ్చారు. మిర్చి యార్డ్ మొత్తం ప్రజలతో కిక్కిరిసిపోయింది. అయితే జగన్ పర్యటన నేపథ్యంలో భద్రత ఏర్పాట్లు చేయలేదని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. మరోవైపు జగన్ పర్యటనకు అనుమతి లేదని పోలీసులు అంటున్నారు.

ఎమ్.ఎస్.ఎమ్.ఈ లోన్స్ పై అవ‌గాహ‌న స‌ద‌స్సు ఏర్పాటు

మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌కు అండ‌గా ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) ఎమ్.ఎస్.ఎమ్.ఈ లోన్స్ పై అవ‌గాహ‌న స‌ద‌స్సు ఏర్పాటు విజ‌య‌వాడ : ప్ర‌తి కుటుంబంలో ఒకరు ఎంట‌ర్ ప్రెన్యూర్ వుండాల‌న్న ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఆశ‌యాన్ని ఎన్టీఆర్ జిల్లాలో ముందుకి తీసుకువెళ్లేందుకు ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) తీవ్రంగా కృషి చేస్తున్నారు. ప్రైమ్ మినిస్ట‌ర్ ఎంప్లాయిమెంట్ జ‌న‌రేష‌న్ ప్రోగ్రామ్ (PMEGP)  కింద ఎమ్.ఎస్.ఎమ్.ఈ (MSME)   ద్వారా లోన్స్ తీసుకుని మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు పారిశ్రామిక‌వేత్త‌లు గా  ఏ విధంగా మార‌వచ్చు అనే అంశం పై  ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) ఆదేశాల మేర‌కు  బుధ‌వారం తూర్పు నియోజ‌క‌వ‌ర్గం 7వ డివిజ‌న్ మొఘ‌ల్ రాజపురం లోని శివాల‌యం వ‌ద్ద‌గ‌ల టిడిపి కార్యాల‌యంలో ప్ర‌జ‌ల‌కు అవగాహ‌న స‌ద‌స్సు జ‌రిగింది.  ఈ సద‌స్సులో నాయ‌కులు మాట్లాడుతూ మ‌ద్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌లంద‌రూ ఆర్థిక స్వాలంబ‌న సాధించేందుకు ఎంపి కేశినేని శివ‌నాథ్ కృషి చేస్తున్నార‌ని తెలిపారు. ఎమ్.ఎస్.ఎమ్.ఈ లోన్స్ ఏ విధంగా తీసుకోవాలి..ఏ యూనిట్స్ ఏర్పాటు చేసుకుంటే ఎలాంటి ఉప‌యోగం వుంటుందో వివ‌రించారు. అలాగే ఈ ...

_పట్టభద్రుల ప్రగతికి ఆలపాటి రాజేంద్రప్రసాద్ గారికి ఓటు వేసి గెలిపించాలి..

 *_పట్టభద్రుల ప్రగతికి ఆలపాటి రాజేంద్రప్రసాద్  గారికి ఓటు వేసి గెలిపించాలి.....!_* *_పట్టభద్రుల ప్రగతి కోసం ఉమ్మడి కృష్ణ -  గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న "ఆలపాటి రాజేంద్రప్రసాద్"గారికి  తొలి ప్రాధాన్యత ఓటును వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని తెదేపా రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి "బొమ్మాసాని సుబ్బారావు" గారు కోరారు....ఆలపాటికి అఖండ విజయం చేకూర్చుదామని మైలవరం నియోజకవర్గం, గొల్లపూడి గ్రామం స్థానిక మైలురాయి సెంటర్ ప్రాంతంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, నిరుద్యోగ పట్టబద్ధులను కలిసి కరపత్రాలను అందజేసి ఓటు అభ్యర్థించారు....కార్యక్రమంలో గ్రామపార్టీ అధ్యక్షులు నర్రా వాసు గారు,తెదేపా నేతలు నూతలపాటి వెంకటేశ్వరరావు గారు, గూడపాటి పద్మశేఖర్ గారు, జి కె ప్రసాద్ గారు,శ్రీనునాయక్ గారు మరియు స్థానిక కూటమి నాయకులు పాల్గొన్నారు.....!_*