Skip to main content

Posts

Showing posts from March, 2025

టిడిపి , జనసేన పై దేవినేని అవినాష్ ఫైర్

 విజయవాడ ------ టిడిపి , జనసేన పై  దేవినేని అవినాష్ ఫైర్  *ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు , దేవినేని అవినాష్‌* పండుగ పూట ముస్లిం సోదరులు నిరసన తెలిపే పరిస్థితులు రావడం దురదృష్ణకరం  కూటమి ప్రభుత్వం  ముస్లిం సోదరులను మనోభావాలను దెబ్బతీశాయి  మా ఆస్తులను కాపాడాలంటూ దువా చేయాల్సిన పరిస్థితి కల్పించారు ఈ పరిస్థితికి కారణం కేంద్రంలోని ఎన్డీఏ , ఏపీలోని టిడిపి , జనసేన    రాష్ట్రంలోని ముస్లింలకు అండగా ఉంటామని అబద్ధాలు చెబుతున్నారు ముస్లింలకు వ్యతిరేకంగా లోక్ సభ , రాజ్యసభలో తీసుకుంటున్న నిర్ణయాలకు మద్దతిస్తున్నారు ముస్లిం, మైనార్టీలకు అండగా నిలిచిన ఏకైక కుటుంబం వైఎస్సార్ కుటుంబం పార్లమెంట్ లో బీజేపీ తీసుకున్న నిర్ణయాన్ని ధైర్యంగా మేం వ్యతిరేకించాం  ఎలాంటి మొహమాటం లేకుండా మా రాజ్యసభ , లోక్ సభ సభ్యులు వ్యతిరేకించారు వక్ఫ్ సవరణ బిల్లును టిడిపి,జనసేన ఎంపిలు ఎందుకు వ్యతిరేకించలేకపోతున్నారు    ముస్లిం , మైనార్టీల హక్కుల కోసం రాబోయే రోజుల్లోనూ మేం అండగా ఉంటాం

లా డిగ్రీ లో గోల్డ్ మెడల్ సాధించిన దీపిక.

 లా డిగ్రీ లో గోల్డ్ మెడల్ సాధించిన దీపిక. తండ్రి నిత్యం ప్రజా సమస్యలపై పోరాడే,ప్రకృతి వనరుల అభివృద్ధి కి ,రక్షణకి తన ఇన్వెస్టిగేషన్ జర్నలిజం లో నిరంతరం జీవన పయనం... మరి ఆ చిన్నారిన్మసులో ఇంకా చెరగనిముద్ర వేశాయి..  తను మరింత చేరువగా ప్రజలకు న్యాయం అందించాలి అనుకుంది. తన లక్ష్యం నిర్ధారించుకుంది.అకుంఠిత దీక్షతో ముందుకు సాగింది .. న్యాయ దేవత ఆస్థానంలో ప్రవేశానికి న్యాయ శాస్త్ర విజ్ఞానం సంపాదించి అధ్యయనంలో కలికితురాయి గాసరస్వతి రూపంలో  విద్యలో అత్యున్నత బంగారుపతకం సాధించి నిరూపించింది. తాతినేని దీపిక. సామాన్య మధ్య తరగతి కుటుంబం నుంచి కేవలం విద్య తో మాత్రమే ఉద్ధరణ పొందవచ్చు అని తలచి నిరూపించింది. మన కృష్ణా జిల్లా ముద్దుబిడ్డ కు విజయవాడ లోని సిద్ధార్ధ న్యాయకళాశాలగోల్డెన్ జూబ్లీ ఉత్సవం మరియు కళాశాల 39వ వార్షికోత్సవo సందర్బంగా 2023-2024 లా డిగ్రీ అత్యధిక ప్రతిభ కనబరచి  యూనివర్సిటీ టాపర్ గా ఎంపికైన తాతినేని దీపిక కు ముఖ్య అతిధి గా విచ్చేసిన ఏపీ హై కోర్టు న్యాయ మూర్తి జస్టిస్ ఎన్ జయ సూర్య చేతుల మీదుగా గోల్డ్ మెడల్ తో పాటు ప్రశంసా పత్రం అందజేసి అభినందించడం జరిగింది.

జిల్లాలో 2,28,813 పెన్ష‌న్ల‌కు రూ. 98.11 కోట్లు విడుద‌ల*

*ఎన్‌టీఆర్ జిల్లా, మార్చి 31, 2025* *జిల్లాలో 2,28,813 పెన్ష‌న్ల‌కు రూ. 98.11 కోట్లు విడుద‌ల* - *పేద‌ల సేవ‌లో స్ఫూర్తికి అనుగుణంగా పంపిణీ చేప‌ట్టండి* - *క్షేత్ర‌స్థాయిలో నిరంత‌ర ప‌ర్య‌వేక్ష‌ణ త‌ప్ప‌నిస‌రి: క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌* జిల్లాలో ఏప్రిల్ 1వ తేదీన ఎన్‌టీఆర్ భ‌రోసా పెన్ష‌న్ల కింద 2,28,813 పెన్ష‌న్ల‌కు దాదాపు రూ. 98.11 కోట్లు పంపిణీ చేయ‌డం జ‌రుగుతుంద‌ని.. క్షేత్ర‌స్థాయిలో అధికారులు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేసి ఇళ్ల వద్ద పెన్ష‌న్ల పంపిణీ స‌జావుగా సాగేలా కృషిచేయాల‌న్నారు. సోమ‌వారం క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ‌.. డీఆర్‌డీఏ పీడీ, ఆర్‌డీవోలు, మునిసిప‌ల్ క‌మిష‌న‌ర్లు, ఎంపీడీవోలతో ఎన్‌టీఆర్ భ‌రోసా పెన్ష‌న్ల పంపిణీపై టెలీకాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. పేద‌ల సేవ‌లో.. స్ఫూర్తికి అనుగుణంగా పెన్ష‌న్ల పంపిణీ ప్ర‌క్రియ‌ను విజ‌య‌వంతంగా పూర్తిచేసేలా దిశానిర్దేశం చేశారు. మంగ‌ళ‌వారం ఉదయం 7 గంటలకు పెన్షన్ల పంపిణీ ప్రారంభించి, ఎక్క‌డా ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాల‌న్నారు. పంపిణీ స‌మ‌యంలో ఇబ్బందిలేకుండా ఉండేందుకు పెన్ష‌న్ ర‌కాన్నిబ‌ట్టి న‌గ‌దు మొత్తాన్ని బండిల్‌గా సిద్ధం చేసుకోవాల‌న్నారు. ల‌బ్ధిదారుల ఇళ్ల వ‌ద్...

పదవీ విరమణ చెందిన సిబ్బందికి ఆత్మీయ వీడ్కోలు పలికిన జిల్లా ఎస్పీ శ్రీ ఆర్.గంగాధరరావు, ఐపీఎస్.,_

పదవీ విరమణ చెందిన సిబ్బందికి ఆత్మీయ వీడ్కోలు పలికిన జిల్లా ఎస్పీ శ్రీ ఆర్.గంగాధరరావు, ఐపీఎస్.,_ _సుదీర్ఘకాలం పాటు పోలీసు శాఖకు విశిష్ట సేవలు అందించి నేడు పదవి విరమణ చెందుతున్న ఇద్దరు పోలీస్ సిబ్బందికి జిల్లా ఎస్పీ శ్రీ ఆర్. గంగాధరరావు, ఐపీఎస్ గారు పోలీస్ క్యాంపు కార్యాలయంలో  పదవీ విరమణ చెందుతున్న సిబ్బంది కుటుంబ సభ్యుల సమక్షంలో శాలువాతో సత్కరించి, జ్ఞాపికలు బహుకరించి ఘనంగా ఆత్మీయ వీడ్కోలు పలికారు._ *ఈ సందర్భంగా ఎస్పీ గారు వారితో మాట్లాడుతూ* ▪️ఇంతకాలం పాటు పోలీస్ శాఖకు మీరు అందించిన సేవలు అభినందనీయమని, విరమణానంతరం మీరు అందరూ తప్పనిసరిగా ఆరోగ్యంపై దృష్టి సారించాలని, వచ్చిన ప్రయోజనాలను దుర్వినియోగం కానివ్వకుండా జాగ్రత్తగా వాడుకోవాలని తెలియజేశారు. ▪️ఏ సమయంలో ఏ సహాయం కావాలన్నా పోలీస్ శాఖ ఎల్లవేళలా సిద్ధంగా ఉంటుందని, విరమణ చెందిన మీరంతా పోలీస్ కుటుంబ సభ్యులైనని తెలిపారు *పదవి విరమణ చెందిన సిబ్బంది* 1.SI - 777 A.K జిలాని 2.ASI - 935 V.S.S ప్రసాద్

ముస్లిం సోదరసోదరిమణులు అందరికి రంజాన్ శుభాకాంక్షలు :

  *ముస్లిం సోదరసోదరిమణులు అందరికి రంజాన్ శుభాకాంక్షలు : ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అద్యక్షులు దేవినేని అవినాష్* మత సామరస్యాన్ని పెంపొందించి ఐక్యతను చాటే పర్వదినం పవిత్ర రంజాన్ అని, రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరిసోదరులు అందరికి ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అద్యక్షులు దేవినేని అవినాష్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ నెల రోజులు కఠిన ఉపవాస దీక్షలు చేపట్టి ఆ అల్లాహ్ కి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన ముస్లింలు అందరూ సుఖసంతోషాలతో జీవించేలా ఆ అల్లా అనుగ్రహించలని ఆకాంక్షించారు. వైసీపీ ప్రభుత్వంలో ముస్లిం మైనారిటీల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దే.. మరలా ముఖ్యమంత్రి కావాలని, రాష్ట్రంలో మరోమారు వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు అయ్యేలా ఆ అల్లా దీవెనలు అందించాలని అవినాష్ కోరుకున్నారు.

పెట్టుబడులతో రండి.. సహకరిస్తాం - ప్రభుత్వ భూములు ఇచ్చి ప్రోత్సహిస్తా

పెట్టుబడులతో రండి.. సహకరిస్తాం - ప్రభుత్వ భూములు ఇచ్చి ప్రోత్సహిస్తా - టూరిజం అభివృద్ధిలో హోటళ్లది కీలక పాత్ర - అందుకే పాలసీని తెచ్చి ఆహ్వానిస్తున్నాం - హోటలర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడులకు అత్యధిక ప్రాధాన్యమిస్తోందని, అందుకోసం ప్రత్యేక ప్రోత్సాహకాలను అందిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో శనివారం పలు రాష్ట్రాల హోటల్ రంగ ప్రముఖులు సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా హోటలర్స్ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురావడంతోపాటు, పలు అంశాలపై చర్చించారు. హోటల్ రంగం పర్యాటక రంగానికి అనుబంధంగా పెద్ద ఎత్తున వృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయని వివరించారు. పెట్టుబడులను ప్రోత్సహించే ముఖ్యమంత్రిగా హోటలర్స్ అసోయేషన్ తరఫున కొన్ని సమస్యలు ఉన్నాయని, వాటి పరిష్కారం విషయంలో చొరవ తీసుకోవాలని కోరారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ హోటలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్వీ స్వామి చర్చలో వచ్చిన అంశాలను వివరించారు. తాము చర్చించాలనుకున్నఅన్ని విషయాలను సీఎం చంద్రబాబు సావధానంగా సమయం కేటాయించి విన్నారని, సానుకూలత వ్యక్...

భారత రాజ్యాంగ పరిరక్షణ సమితి కార్యకర్తల సమావేశం

 ది 29 మార్చి 2025న న్యూస్9 నాదెండ్ల మండలం సాతులూరు గ్రామంలో ఎస్సీ కాలనీ లో ఏర్పాటు చేసిన భారత రాజ్యాంగ పరిరక్షణ  సమితి కార్యకర్తల సమావేశంలో వ్యవస్థాపక అధ్యక్షులు సిహెచ్ సుబ్బారావు పాల్గొని మాట్లాడుతూ  1)ఎస్సీలు నివాసం ఉంటున్న ప్రాంతాలలో సిమెంటు రోడ్లు మురికి కాలవలు త్రాగునీటి వసతి మరుగుదొడ్లు తదితర మౌలిక వసతులు కొరకు 40 శాతానికి పైగా ఎస్సీలు ఉన్న రాష్ట్రంలో 1027 గ్రామాలలో ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన పథకం దాంతోపాటు ఉపాధి హామీ పథకం స్వచ్ఛంద కార్పొరేషన్ ఇతర కేంద్ర రాష్ట్ర పథకాలను సంధానించి ఒక్కొక్క గ్రామంలోని ఎస్సీ నివాసాల యందు 60 నుంచి 70 లక్షలు ఖర్చు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావడం హర్షనీయమని   2) అయితే ప్రతి గ్రామంలో ఉన్న ఎస్సీ వాడల యందు  కనీసం ఒక కోటి రూపాయలు తగ్గకుండా నిధులు హెచ్చించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని డిమాండ్ చేస్తున్నాం.  3), వారికి కేటాయించిన నిధులు పక్కాగా వారు నివాసం ఉండే ప్రాంతాల్లోనే మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని,  4) రాజకీయాలకు అతీతంగా ఎలాంటి పక్షవాతం లేకుండా వారికి కేటాయించిన నిధులు ఎస్సీ కాలనీలో నందు మౌలిక వసతుల నిమ...

ఆపరేషన్ బుడమేరు

 ఆపరేషన్ బుడమేరును వెంటనే అమలు చేయాలని బుడమేరు ప్రక్షాళనకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ రాష్ట్ర  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు బహిరంగ లేఖ రాశారు. గురువారం స్థానిక హనుమాన్ పేట దాసరి భవన్ సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యాలయంలో జరిగిన పత్రిక విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ పత్రికా విలేఖరుల సమావేశంలో సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ తో పాటు గా విజయవాడ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు బుట్టి రాయప్ప, మల్నిడి యలమందరావు, పరుచూరి రాజేంద్ర బాబు, లంకా గోవిందరాజులు, సమితి సభ్యులు ఉప్పుటూరి అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నిషేధిత మందుల వ్యాపారి కొండపల్లి బుజ్జి పై విచారణ జరిపి తక్షణమే అరెస్టు చేయాలి ఆపరేషన్ గరుడ పై శ్వేత పత్రం విడుదల చేయాలి ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ కు బహిరంగ లేఖ రాసిన సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ .గురువారం స్థానిక హనుమాన్ పేట దాసరి భవన్ సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యాలయంలో జరిగిన పత్రిక విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ పత్రిక...

గొల్లపూడిలో అక్రమ నిర్మాణాలపై అడ్డుకట్ట లేదా....!!

 *అక్రమ నిర్మాణానికి  "పెద్ది ప్రసాదం" అందిందా* గొల్లపూడిలో అక్రమ  నిర్మాణాలపై అడ్డుకట్ట లేదా....!! అవినీతి అధికారులకు *అగ్ర తాంబూలం* అందుకే అడ్డగోలు నిర్మాణాలు చేస్తున్న అడిగేవారు లేరు... అడ్డంగా  దోచుకుంటున్న ఆపేవారు లేరు... అండగా ఉండేది అక్కడ *ఎవరు* అంతా లోపా భూయిష్టం... అంతిమంగా అన్యాయం.  ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టేందుకు *పెద్ది ప్రసాదం*(పెద్ది రమేష్ బిల్డర్) అవినీతిలో రోజుకో మలుపు... తాంబూలాలు ఇస్తే తప్పులు ప్రోత్సహిస్తారా.....!! ఈ అవినీతి కంపు కలిగేదెవరు. Note:  *ప్రభుత్వం ఇస్తున్న జీతభత్యాలు సరిపోవటం లేదా..???* *అధికారుల నిర్లక్ష్యం ఇంకా ఎన్నాళ్లు....?* *మామూళ్లు మత్తు  ఇంకెన్నాళ్లు...?*

వైయస్సార్ కాంగ్రెష్ పార్టీ కమ్మవారిపాలెం ఎంపీటీసీ సభ్యురాలు పెసరవెల్లి రమాదేవి గారిని ఏకగ్రీవం

 ఎన్టీఆర్ జిల్లా / నందిగామ : నందిగామ ఎంపీపీ గా *పెసరమేల్లి రమాదేవి* ఏకగ్రీవం. ఇచ్చిన మాట ప్రకారం పెసరమేల్లి రమాదేవికి అవకాశం కల్పించిన నియోజకవర్గ సమన్వయకర్త *డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు గారు*, ఎమ్మెల్సీ *డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గార్లు.* 27/03/2025, బుధవారం.  స్థానిక నందిగామ మండల పరిషత్ కార్యాలయంలో   జరిగిన ఎంపీపీ ఎన్నికలలో  వైయస్సార్ కాంగ్రెష్ పార్టీ కమ్మవారిపాలెం ఎంపీటీసీ సభ్యురాలు పెసరవెల్లి రమాదేవి గారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.    అనంతరం ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ గారు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు గార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలసి పెసరమేల్లి రమాదేవి గారిని  ఎంపీపీ సీట్ లో కూర్చోబెట్టి సత్కరించారు.  ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ గారు మాట్లాడుతూ  రమాదేవి ఎంపీపీ గా ఎన్నికైనందుకు సంతోషంగా ఉందని, ఎంపీటీసీ సభ్యులందరూ నిబద్ధతతో పార్టీ నిర్ణయాన్ని కట్టుబడి ఉన్నారని వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. పార్టీ లో  ప్రతిఒక్కరికి   అవకాశాలు వస్తాయని ప్రలోభాలకు  లోనవ్వకుండా నిలబడిన వార...

ఉప సర్పంచ్ పదవికి ఏకగ్రీవంగా ఎన్నికైన మరీదు ఉషారాణి

 *పెద్ద ఆవుటపల్లి ఉప సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవం ఉప సర్పంచ్ పదవికి ఏకగ్రీవంగా ఎన్నికైన మరీదు ఉషారాణి* గన్నవరం నియోజకవర్గం, ఉంగుటూరు మండలంలోని పెద్ద ఆవుటపల్లి గ్రామ ఉపసర్పంచ్ ఎన్నిక ప్రిసైడింగ్ అధికారి టీ.వీ.ఎస్.ఆర్.కె ప్రసాద్ ఆధ్వర్యంలో ఈరోజు అనగా గురువారం ఉదయం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఉప సర్పంచ్ పదవులకు ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం వారు ఇచ్చిన ఆదేశాల మేరకు గన్నవరం నియోజకవర్గం, ఉంగుటూరు మండలంలోని పెద్ద ఆవుటపల్లి గ్రామపంచాయతీ ఉప సర్పంచ్ ఎన్నిక ప్రిసైడింగ్ అధికారి టీ.వీ.ఎస్.ఆర్.కె ప్రసాద్ ఆధ్వర్యంలో గురువారం ఉదయం నిర్వహించారు. పెద్ద ఆవుటపల్లి ఉప సర్పంచ్ గా 8వ వార్డు సభ్యురాలు అయిన మరీద్ ఉషారాణి (టిడిపి) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికల అధికారులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉప సర్పంచ్ గా ఎన్నికైన మరీదు ఉషారాణికి ప్రిసైడింగ్ అధికారి టి.వి.ఎస్.ఆర్.కె ప్రసాద్ ధ్రువీకరణ పత్రం అందజేసి ప్రమాణ స్వీకారం చేయించారు.  ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు కొండేటి వెంకటేశ్వరరావు, మండల టిడిపి ప్రధాన కార్యదర్శి ఆళ్ల హనోక్, గన్నవరం ఎ...

కేంద్ర‌మంత్రి హర్దీప్‌ సింగ్‌ పురి అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన ఎన్డీయే ఎంపిల సమావేశం...

కేంద్ర‌మంత్రి హర్దీప్‌ సింగ్‌ పురి అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన ఎన్డీయే ఎంపిల సమావేశానికి ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) హాజరు  ఢిల్లీ:  కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పురి అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన ఎన్డీయే ఎంపిల స‌మావేశంలో విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ పాల్గొన్నారు. ఎన్డీయే ప్ర‌భుత్వం ఎన్డీయే కూట‌మిలోని పార్ల‌మెంట్ స‌భ్యుల‌ నియోజ‌క‌వ‌ర్గాల స‌మ‌స్య‌లు, కేంద్ర ప‌థ‌కాల అమ‌లు,  నిధుల అవ‌స‌రాల‌ గురించి తెలుసుకునేందుకు కేంద్ర‌మంత్రుల‌కు కొంత‌మంది ఎంపిల‌ను గ్రూపులుగా  అప్ప‌గించి ప్ర‌తి మూడు నెల‌ల‌కొక‌సారి స‌మావేశం కావాల‌ని ఆదేశించింది. కేంద్ర‌మంత్రి హార్టీప్ సింగ్ కి అధ్య‌క్ష‌త‌న వున్న ఎన్డీయే ఎంపిల గ్రూపులో ఎపికి చెందిన  కేశినేని శివ‌నాథ్ (చిన్ని), ఎంపి బస్తిపాటి నాగరాజు పంచలింగాల వున్నారు.     కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పురి అధ్య‌క్ష‌త‌న మంగ‌ళవారం రాత్రి ఢిల్లీలోని ఆయ‌న నివాసంలో ప‌లువురు ఎన్డీయే ఎంపిల‌తో డిన్నర్ మీటింగ్ జ‌రిగింది. ఈ స‌మావేశానికి కేంద్ర ర‌క్షణ శాఖ మంత్రి రాజ‌నాథ్ సింగ్ ...

డీఆర్‌డీఓ ఛైర్మన్ డాక్టర్ సమీర్ విక్రాంత్‌తో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) భేటీ

*డీఆర్‌డీఓ ఛైర్మన్ డాక్టర్ సమీర్ విక్రాంత్‌తో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) భేటీ* న్యూఢిల్లీ: విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) బుధవారం ఢిల్లీలోని డీఆర్‌డీఓ భవన్‌లో భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) ఛైర్మన్ డాక్టర్ సమీర్ విక్రాంత్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ శివనాథ్, డీఆర్‌డీఓ ఛైర్మన్‌కు తిరుపతి ప్రసాదం అందజేశారు. వీరిద్దరూ రక్షణ రంగానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ఎపి నూత‌న రాజ‌ధాని అమ‌రావ‌తి లో భాగ‌మైన విజ‌య‌వాడ ప‌రిస‌ర ప్రాంతాలు పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి రక్షణ ఉత్పత్తి పరిశ్రమలను ఏర్పాటు చేయాలని ఎంపీ శివనాథ్ (చిన్ని) కోర‌గా, డీఆర్‌డీఓ ఛైర్మన్ డాక్టర్ సమీర్ విక్రాంత్ ఈ ప్రతిపాదనను సానుకూలంగా పరిశీలిస్తామని తెలిపారు.

సోషల్ మీడియా అరెస్ట్ లపై పోలీసులపై ఏపీ హైకోర్టు ఆగ్రహం

 సోషల్ మీడియా అరెస్ట్ లపై పోలీసులపై ఏపీ హైకోర్టు ఆగ్రహం కోపం వస్తున్నా నియంత్రించుకుంటున్నాం అంటూ పోలీసుల తీరుపై మండిపడ్డ ఏపీ హైకోర్టు  సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యంగ్యంగా పోస్టులు పెడితే అరెస్ట్ చేస్తారా? అలా అయితే సినిమా హీరోలను, విలన్ లను కూడా అరెస్ట్ చేయాలంటూ ఘాటు వ్యాఖ్యలు తాజాగా గుంటూరుకు చెందిన ప్రేమ్ కుమార్ సోషల్ మీడియాలో గుంటలు పూడ్చాలి అంటే ఊరూరా టోల్ కట్టాల్సిందే అంటూ ఒక పోస్ట్ పెట్టాడు.. దీనిపై కర్నూల్ లో టీడీపీ నేత ఫిర్యాదుతో కర్నూల్ పోలీసులు గుంటూరుకు వెళ్లి ప్రేమ్ కుమార్ ను అరెస్ట్ చేశారు పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారంటూ ప్రేమ్ కుమార్ కొడుకు హైకోర్టులో వేసిన పిటిషన్ పై విచారణ జరగగా, కోర్టు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది కర్నూల్ సీఐని ఈ కేసుల్లో స్పందించినంత వేగంగా మిగతా కేసుల్లో స్పందిస్తున్నారా? ఇప్పటి వరకు ఎన్ని కేసులను ఇలా మెరుపు వేగంతో విచారించారు అంటూ హైకోర్టు ప్రశ్నించింది

స్కూళ్లు ప్రారంభానికి ముందే, ఇంట్లో చదివే పిల్లల తల్లికి ఒక్కొక్కరికి ₹15,000 వందనం పథకం కింద అందిస్తాం: సీఎం చంద్రబాబు

 స్కూళ్లు ప్రారంభానికి ముందే, ఇంట్లో చదివే పిల్లల తల్లికి ఒక్కొక్కరికి ₹15,000 వందనం పథకం కింద అందిస్తాం: సీఎం చంద్రబాబు

రాష్ట్ర హోంమంత్రి అనిత గార్కి పుట్టిన రోజు శభాకాంక్షలు తెలియజేసిన T.D.P సీనియర్ నేత మాజీ Dy మేయర్ దాడి సత్యనారాయణ

 రాష్ట్ర హోంమంత్రి అనిత గార్కి పుట్టిన రోజుశభాకాంక్షలు తెలియజేసిన T.D.P సీనియర్నేత మాజీ Dy మేయర్ దాడి సత్యనారాయణ

ఆంధ్రప్రదేశ్ శాసనసభ మండలి సభ్యుల జీతాలు పెంపు.

 *ఆంధ్రప్రదేశ్ శాసనసభ మండలి సభ్యుల జీతాలు పెంపు.* 💰💰💰💰💰💰💰 *🏓ఎమ్మెల్యేల ఎమ్మెల్సీల జీతాలు 95,000 నుండి 1,50,000.* *🏓ఇంటి అద్దె 25000 నుండి 50,000.* *🏓రైల్వే చార్జీలు 1,00,000,*   *🏓పేపర్ ఖర్చులు 1,00,000.* *🏓మాజీ ఎమ్మెల్యే పెన్షన్ 25,000 నుండి 50,000.* *🏓ఎమ్మెల్యే కారు లోను 10,00,000 నుండి 25,00,000 కు పెంపు.* *🌹దయచేసి  ఈ   సoదేశన్ని    అన్ని   గ్రూప్లకు   పoపoడి.     ఎoదు కoటే  మనకు  ఎ   కొద్దిగా  జీతo   పెరగినా  మీడియ  తేగ     publicity ఇస్తుoది.ఇది   అoదరికి తెలియాలి.* *అబ్బబ్బబ్బ . . . . .  ఏం పెంచుకున్నారండి మీ జీతాలు!   ఉద్యోగులకు 23% పి.ఆర్.సి. ఇచ్చినందుకు పి.ఆర్.సి.  కమీషన్, ఎన్నెన్ని సమావేశాలు, సంప్రదింపులు, సంఘ నాయకులకు ఎన్నెన్ని నిద్రలేని రాత్రులు, ఊగులాటలు, ఊసులాటలు, మరలా ద్విసభ్య కమిటీలు, త్రిసభ్య  కమిటీలు. CS కమిటీ దానిపైన సమావేశాలు, సంప్రదింపులు, అయినా చాలా ఎక్కువే ఇచ్చేశామని ప్రజల్లోకి వెళ్ళి...

ప్రెస్ మీట్ విశేషాలు - నవతరంపార్టీ

 *ప్రెస్ మీట్ విశేషాలు - నవతరంపార్టీ - 24.03.2025.* *తల్లి చెల్లికి గౌరవం ఇవ్వని వ్యక్తి జగన్,ఆయన మహిళలకు గౌరవం ఇస్తాడని విడదల రజని కితాబు ఇవ్వడం హాస్యాస్పదం-నవతరం పార్టీ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం* *తల్లి విజయమ్మ, చెల్లి షర్మిలను నిత్యం కంటతడి పెట్టించే వ్యక్తి జగన్, అటువంటి వ్యక్తి మహిళలకు గౌరవం ఇస్తాడని మాజీ మంత్రి విడదల రజని జగన్మోహన్ రెడ్డికి ఇచ్చే సర్టిఫికెట్ చెల్లదని నవతరం పార్టీ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం మీడియా సమావేశంలో అన్నారు.* *చిలకలూరిపేటలో విడదల రజని ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడే హక్కు కోల్పోయిన విషయం మరచిపోయారని అన్నారు.సాక్షాత్తు పార్లమెంటరీ పార్టీ నేత నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ని పట్టుకొని "నీచుడు"అని సంభోదించడం విజ్ఞత ఉన్న మహిళలు మాట్లాడే భాష కాదని అన్నారు. అవినీతి ఘానాపాటి ప్రత్తిపాటి అని మాట్లాడుతూ ఉన్న పుల్లారావు నీకుమల్లె నువ్వు వసూలు చేసిన అవినీతి సొమ్ము పసుమర్రు రైతులకు తిరిగి ఇవ్వలేదని అన్నారు. నీమాదిరిగా అవినీతి నిరోధక శాఖ కేసులు ఎదుర్కొలేదని అన్నారు.* *నీ చరిత్ర చూస్తే చెప్పలేనంత అవినీతితో కూడిన చరిత్ర గా మిగిలిపోయిందని అన్నారు. నీ...

మానవ హక్కుల పరిరక్షణ చట్టం 1993 సెక్షన్ 30 ప్రకారం ప్రతి జిల్లాలో

 పత్రిక ప్రకటన  మానవ హక్కుల పరిరక్షణ చట్టం 1993 సెక్షన్  30  ప్రకారం ప్రతి జిల్లాలో మానవ హక్కుల  కోర్టులు ఉండాలి కానీ ఈ చట్టం అమలు చేయడం లేదని మానవ హక్కుల కౌన్సిల్ గౌరవ అధ్యక్షులు ప్రొ. వై. వై సత్యనారాయణ చర్చా వేదిక లో అన్నారు. మానవ హక్కుల న్యాయస్థానాలలో హక్కుల ఉల్లంఘనలనుండి ఉత్పన్నమయ్యే నేరాలను వేగవంతమైన విచారణలు చేయడానికి రూపొందించారు. రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సమ్మతితో ప్రతి జిల్లాలో సెషన్స్ కోర్టును మానవ హక్కుల న్యాయస్థానం గా ఏర్పాటు చేసినా బా ధితులకు  సత్వర న్యాయం లభించడం లేదని అన్నారు. ఈ చట్టం అమలులోకి వచ్చి 32 సం. లయినా పౌరులకు మానవ హక్కుల కోర్టుల గురించి అవగాహన లేదని మానవ హక్కుల కౌన్సిల్ రాష్ట్ర కార్యదర్శి మంత్రి శ్యామ్ ప్రసాద్ తెలిపారు. ఈ చట్టం ప్రకారం ప్రత్యేక న్యాయమూర్తి ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకం జరగలేదని అన్నారు. ముఖ్యం గా మానవ హక్కుల కోర్టులలో విచారించగల నేరాలను పేర్కొనలేదని అన్నారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ సెక్షన్ 30, 31 ల సవరణకు సిఫారసు చేసినా పార్లమెంట్ చర్యలు తీసుకోలేదని అన్నారు. మానవ హక్కుల న్యాయస్థానాలను...

ఇఫ్తార్ విందులో పాల్గొన్న మాజీ మంత్రి, పశ్చిమ వైసిపి ఇంచార్జ్ వెలంపల్లి

ఇఫ్తార్ విందులో పాల్గొన్న మాజీ మంత్రి, పశ్చిమ వైసిపి ఇంచార్జ్ వెలంపల్లి స్థానిక 34వ డివిజన్ గౌసియా మస్జీద్ వద్ద వైసిపి నాయకులు షేక్ మెహబూబ్ (మాబు) ఆద్వర్యంలో సోమవారం నాడు పవిత్ర రంజాన్ మాసం పురస్కరించుకొని ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ విందులో ముస్లిం సోదరులు, వైసిపి నాయకులతో కలిసి మాజీ మంత్రివర్యులు, విజయవాడ పశ్చిమ వైసిపి ఇంచార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు పాల్గొని ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు అనంతరం ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందుని వడ్డించారు. ఈ కార్యక్రమంలో 34వ డివిజన్ కార్పొరేటర్, APIDC మాజీ చైర్మన్ బండి పుణ్యశీల, వైసిపి నాయకులు బండి రాజ్ కుమార్, ఎన్టీఆర్ జిల్లా మైనారిటీ అధ్యక్షులు షేక్ మస్తాన్ తదితరులు పాల్గొన్నారు

గ‌వ‌ర్న‌ర్ సయ్యద్ అబ్దుల్ నజీర్ కు స్వాగ‌తం

గ‌వ‌ర్న‌ర్ సయ్యద్ అబ్దుల్ నజీర్ కు స్వాగ‌తం ప‌లికిన ఎసిఎ అధ్యక్షుడు ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) వైజాగ్ : ఐపీఎల్ లీగ్ లో భాగంగా సోమవారం వైజాగ్  ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో జ‌రిగిన  ఢిల్లీ క్యాపిట‌ల్స్ వ‌ర్సెస్ ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ క్రికెట్ మ్యాచ్ ను వీక్షించేందుకు విచ్చేసిన గ‌వ‌ర్న‌ర్ సయ్యద్ అబ్దుల్ నజీర్, స‌మీరా న‌జీర్ దంప‌తుల‌కు ఆంధ్ర క్రికెట్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడు, ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) , ఎసిఎ కార్య‌ద‌ర్శి రాజ్య‌స‌భ ఎంపి సానా స‌తీష్‌, ఎసిఎ కోశాధికారి దండ‌మూడి శ్రీనివాస్ ల‌తో క‌లిసి పుష్పగుచ్చం అందించి ఘ‌న‌స్వాగ‌తం ప‌లికి జ్ఞాపిక‌ను కూడా బ‌హుక‌రించారు. అనంత‌రం గ‌వ‌ర్న‌ర్ దంప‌తుల‌తో క‌లిసి క్రికెట్ మ్యాచ్ వీక్షించారు. త‌మ ఆహ్వానాన్ని మ‌న్నించి క్రికెట్ మ్యాచ్ వీక్షించేందుకు వ‌చ్చిన గ‌వ‌ర్న‌ర్ సయ్యద్ అబ్దుల్ నజీర్ కు ఎపిఎ అధ్య‌క్షుడు ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని)  సోష‌ల్ మీడియా ద్వారా ద‌న్య‌వాద‌ములు తెలిపారు.

ఈ నెల 26వ తేదీన ఇఫ్తార్ విందుకు ముఖ్య అతిధిగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు..

 *ప్రెస్ నోట్ -23-03-2025* *విజయవాడ* *ఈ నెల 26 తేదీన NAC కళ్యాణ మండపంలో వైసీపీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు కార్యక్రమం గురించి తూర్పు నియోజకవర్గ వైసీపీ శ్రేణులు మరియు మైనారిటీ నాయకులతో సమావేశం అయిన ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు,తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్  దేవినేని అవినాష్* ఈ నెల 26వ తేదీన ఇఫ్తార్ విందుకు ముఖ్య అతిధిగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు.. ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున తూర్పు నియోజకవర్గ వైసీపీ శ్రేణులు,మైనారిటీ నాయకులు వచ్చి విజయవంతం చేయాలి.. కూటమి ప్రభుత్వం వచ్చాక మైనారిటీ సోదర సోదరీమణులు అందరికి అన్యాయం జరిగింది.. గత వైసీపీ ప్రభుత్వం లో మైనార్టీ ప్రజలకి అనేక సంక్షేమ కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు అందించారు... కూటమి ప్రభుత్వం చేస్తున్న అక్రమాలను నిలదీసేవిధంగా మన పార్టీ ముఖ్య నాయకులు,కార్యకర్తలు ముందుకు వెళ్ళాలి... కూటమి ప్రభుత్వానికి సంవత్సరకాలం ఇచ్చాం కానీ ప్రజలకి ఏమి చేయలేము అని చేతులు ఎత్తేశారు... తూర్పు నియోజకవర్గంలో నూతనంగా ఎన్నికైన పార్టీ లో వివిధ హోదాలో  నాయకులు అందరూ ఆక్టివ్ గా ఉండాలి.. బూత్ లేవీల్ నుండి ముందుగానే వర్క్ చేసుకుని  వచ్చే ఎన్నికల్లో ...

తీరు మార్చుకోకపోతే కఠిన చర్యలు-సిఐ రామారావు

 *తీరు మార్చుకోకపోతే కఠిన చర్యలు-సిఐ రామారావు ఉయ్యూరు సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి రౌడీషీటర్లు, సస్పెక్ట్ షీటర్లకు సర్కిల్ కార్యాలయంలో ఇన్స్పెక్టర్ రామారావు కౌన్సిలింగ్ నిర్వహించారు.  రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీట్లు కలిగినటువంటి అందరూ నేర ప్రవృత్తిని విడాలి అని.. తాము చేసే పని ఎవరికీ తెలియదు అనుకుంటే పొరపాటే అని పోలీసులు మీ కదలికలను ఎప్పుడు గమనిస్తూనే ఉంటారు అని తెలిపారు.  తీరుమార్చుకోకపోతే  కఠిన చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు

గద్దె చేతుల మీదుగా తార్నాక కేప్ ప్రారంభోత్సవం

 గద్దె చేతుల మీదుగా తార్నాక కేప్ ప్రారంభోత్సవం విజయవాడ తూర్పు నియోజకవర్గం లో కొత్తగా మొగల్రాజపురం శాంతినగర్ రెండవ రోడ్ లో గల తర్నాక కేఫ్ ప్రారంభోత్సవం కార్యక్రమం అంగరంగ వైభవంగా  జరిగింది.   ఈ కేఫ్ లో ప్రత్యేకమైన రుచులు నార్త్ ఇండియా బ్రేక్ ఫాస్ట్, కారం దోస చైనీస్ఐటమ్స్ కర్ణాటక స్పెషల్ దోశ, విభిన్నమైన  రుచులతోపాటు వెన్నదోస వీళ్ళ ప్రత్యేకత..  తూర్పు నియోజకవర్గం గద్దె రామ్మోహన్ గారు పాల్గొని తార్నాక కేఫ్ ప్రారంభోత్సవం చేయడం చాలా సంతోషంగా ఉందని కేఫ్ యజమానులు శ్రీరామ్, వివేక్, ని సార్  భావించారు..  ఈ కార్యక్రమంలో గద్దె క్రాంతి, అజయ్ కుమార్, మమ్ము నేను ప్రసాద్, సాయిబాబా తదితరులు అతిథులుగా పాల్గొన్నారు..

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్య కోసం బడ్జెట్లో 30% కేటాయించాలి.....

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్య కోసం బడ్జెట్లో 30% కేటాయించాలి భారత రాజ్యాంగ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు సిహెచ్ సుబ్బారావు 24 మార్చ్,న్యూస్9, నాదెండ్ల      భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు విద్య కొరకు30% నిధులు కేటాయించి విద్యకు దూరమైన అన్ని కులాల వారికి విద్య అవకాశాలు కల్పించాలని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎన్నోసార్లు పార్లమెంట్లో పోరాటం చేశారని భారత రాజ్యాంగ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు సిహెచ్ సుబ్బారావు అన్నారు. ఆదివారం మండలంలోని గణపవరం అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారతీయ సమాజంలో సామాజిక సాంస్కృతిక ఆర్థిక రాజకీయపరమైన అసమానతలు దీర్ఘకాలం కొనసాగడం వల్ల సామాజిక సామరస్యత సహజీవనం ప్రమాదంలో పడిపోయిందని అన్నారు. భారతదేశంలో కుల వ్యవస్థ పటిష్ఠంగా నిర్మాణం చేయబడిందని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్య కోసం కేవలం 6% మాత్రమే కేటాయింపు చేస్తున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయని ఆయన తెలిపారు. జనాకర్షణ పథకాలు సంక్షేమ పథకాలు పేదరిక నిర్మూలన చేయకపోగా అన్ని వర్గాల ప్రజల్లో నిరవధిక పేదరికం పెరిగిపోయింది ఆందోళన వ్యక్...

మచిలీపట్నం సబ్ జైల్లో ఉన్న వైసీపీ కార్యకర్తలకు పరామర్శ

మచిలీపట్నం సబ్ జైల్లో ఉన్న వైసీపీ కార్యకర్తలకు పరామర్శ  పెనుగంచిప్రోలు తిరుపతమ్మ తిరునాళ్లలో జరిగిన ఘర్షణలో 16 మంది వైసీపీ కార్యకర్తలు అక్రమ అరెస్ట్  అక్రమ అరెస్టై రిమాండ్ లో ఉన్న కార్యకర్తలను పరామర్శించిన కృష్ణాజిల్లా వైసీపీ పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రి పేర్ని నాని , ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ , జగ్గయ్యపేట వైసీపీ ఇంఛార్జి తన్నీరు నాగేశ్వరరావు  *మాజీ మంత్రి పేర్ని నాని*   పెనుగంచిప్రోలు తిరునాళ్లలో పోలీసుల సమక్షంలోనే టిడిపి నేతలు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు విధ్వేషపూరితంగా మాట్లాడుతూ రెచ్చగొట్టారు  వైసీపీ ప్రభల పై రాళ్లు , కర్రలు విసిరేశారు  వైసీపీ శ్రేణులను నోటికొచ్చినట్లు తిట్టారు  టిడిపి వాళ్లు రెచ్చగొడుతున్నా పోలీసులు కనీసం కట్టడిచేయలేదు  టిడిపి కార్యకర్తలు రాళ్లు విసురుతుంటే ఆత్మరక్షణలో భాగంగా వైసీపీ వాళ్లు అడ్డుకున్నారు  టిడిపి కార్యకర్తలు నానా గొడవ చేస్తుంటే పోలీసులు కనీసం స్పందించలేదు తిరునాళ్లలో గొడవ జరిగినపుడు లేని వాళ్లను పోలీసులు ముద్ధాయిలుగా చేర్చారు  జాతరలో ప్రభలకు పూజలు చేస్తున్న పూజారి కుమారుడిని...

కాకాని ఆశయ సాధన సమితి ఆధ్వర్యంలో

కాకాని ఆశయ సాధన సమితి ఆధ్వర్యంలో  *కాకాని ఆశయ సాధన సమితి ఆధ్వర్యంలో విజయవాడ బెంజ్ సర్కిల్ నందు చలివేంద్రం ఏర్పాటు*   *ముఖ్యఅతిథిగా హాజరైన ఎన్టీఆర్ జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షులు అడ్డూరి  శ్రీరామ్*  విజయవాడ నడిబొడ్డున బెంజ్ సర్కిల్ నందు కాకాని ఆశయ సాధన సమితి అధ్యక్షుడు డాక్టర్ కాకాని తరుణ్ ఆధ్వర్యంలో మాజీ మంత్రివర్యులు కాకాని వెంకటరత్నం కాంస్య విగ్రహం వద్ద చలివేంద్రం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంకు ముఖ్యఅతిథిగా  ఎన్టీఆర్ జిల్లా బిజెపి పార్టీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ పాల్గొని రిబ్బన్ కట్ చేసి, మజ్జిగ పంపిణీ చేశారు అనంతరం  మీడియాతో మాట్లాడుతూ కాకాని వెంకటరత్నం గారి మనవడు కాకాని తరుణ్ కాకాని ఆశయా సాధన సమితి స్థాపించి గత కొంతకాలం నుంచి పేదవారికి పలు రకాలుగా సేవలందిస్తూ కాకాని ఆశయాలకు దగ్గరగా ఉంటూ సేవలందిస్తున్నారు అని కొనియాడారు..అనంతరం ఈ కార్యక్రమంలో బీజేపీ ముఖ్యనేతలు,ఆటో యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ వేసవి కాలంలో ప్రజలకు దాహం తీర్చడం కోసం ఏర్పాటు చేసిన చలివేంద్రాల దాతలకు అడ్డూరి శ్రీరామ్  ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపా...

వల్లభనేని వంశీ ని 2016 సంవత్సరంలో కేసు నిమిత్తం గన్నవరం కోర్టులో

 కృష్ణాజిల్లా: గన్నవరం నియోజకవర్గం÷ వైసిపి మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ని 2016 సంవత్సరంలో కేసు నిమిత్తం గన్నవరం కోర్టులో న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టిన పోలీసులు.... కోర్టు విచారణ అనంతరం వచ్చేనెల 1వ తారీకు విచారణ వాయిదా వేస్తూ తీర్పు చెప్పిన న్యాయమూర్తి.... అనంతరం వంశీని విజయవాడ సబ్ జైలుకు  తరలించిన పోలీసులు.

శ్రీ అభయాంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్టా మహోత్సవం

 *చిలకలూరిపేట మండలం మిట్టపాలెం గ్రామంలో నూతనముగా శ్రీశ్రీశ్రీ అభయాంజనేయ స్వామి వారి పీఠము నందు  శ్రీ అభయాంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్టా మహోత్సవం ఈరోజు అంగరంగ వైభవంగా జరిగింది. మిట్టపాలెం గ్రామస్తులు మరియు ఆలయ కమిటీ సభ్యుల ప్రత్యేక ఆహ్వానంపై ఈ ప్రతిష్టా మహోత్సవంలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపి,తీర్థ ప్రసాదములు స్వీకరించిన శాసనమండలి సభ్యులు శ్రీ మర్రి రాజశేఖర్...*  ఈ ప్రతిష్టా మహోత్సవంలో వారితో *నాగబైరు కామేశ్వరరావు  దండా శ్రీరామమూర్తి  నాగభైరు రవీంద్ర బాబు  ఈవూరి సోంబాబు దండా నాగేశ్వరరావు  నాగబైరు శ్రీనివాసరావు నాగబైరు రామారావు   జరుగుల సుబ్బారావు  తదితరులున్నారు