కృష్ణాజిల్లా పోలీస్
*ప్రతి ఫిర్యాదుదారుని పట్ల సహానుభూతి ప్రదర్శించాలి-- జిల్లా ఎస్పీ శ్రీ ఆర్.గంగాధరరావు, ఐపిఎస్.,*
మీకోసం కార్యక్రమం లో వారి సమస్యను గురించి ఫిర్యాదు చేయడానికి వచ్చే ఫిర్యాదు దారుని పట్ల ప్రతి పోలీస్ అధికారి సహానుభూతి ప్రదర్శిస్తూ, ఆ ఫిర్యాదును ఏ విధంగా పరిష్కరించాలి అని ఆలోచిస్తే ప్రతి ఫిర్యాదారునికి న్యాయం అందించగలమని జిల్లా ఎస్పీ శ్రీ ఆర్. గంగాధరరావు, ఐపిఎస్., గారు అన్నారు.
▪️ఈరోజు స్పందన సమావేశ మందిరంలో నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో జిల్లా ఎస్పీ గారు ఫిర్యాదుదారుల వద్ద నుండి స్వయంగా ఫిర్యాదులు స్వీకరించి, వారి యొక్క ప్రతి సమస్యను విని, ఆ ఫిర్యాదు పట్ల సానుకూలంగా స్పందించి, చట్ట పరిధిలో పూర్తి విచారణ జరిపి పరిష్కారం అందిస్తామని హామీ ఇచ్చారు.
▪️వయసు మళ్ళిన వృద్ధులకు, నడవలేని స్థితిలో ఉన్నవారికి సహాయకారిగా ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేసి వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నారు.
▪️మీకోసం ద్వారా వచ్చే ఫిర్యాదుల పట్ల తక్షణమే స్పందించి పరిష్కారం అందించే దిశగా ప్రతి పోలీసు అధికారి కృషి చేయాలని తెలిపారు ఈరోజు మీకోసం కార్యక్రమానికి 32 ఫిర్యాదులు అందాయి.
*ఈరోజు మీకోసం లో వచ్చిన ఫిర్యాదులలో..*
⏩మచిలీపట్నం నుండి ఒక వివాహిత వచ్చి తనకు వివాహమై 8 నెలలు అవుతుందని, వివాహ సమయంలో అడిగినంత కట్నం కానుకలు ఇచ్చినప్పటికీ అదనపు కట్నం తీసుకురావాలని భర్త, అత్తగారు వేధిస్తున్నారని, కుటుంబ పెద్దల సమక్షంలో పెట్టినప్పటికీ వారిలో ఏ మార్పు లేదని న్యాయం చేయమని ఫిర్యాదు.
⏩ పామర్రు నుండి రోహిత్ అనే యువకుడు వచ్చి తను పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉద్యోగ అన్వేషణలో ఉండగా, తన సమీప బంధువు రైల్వేలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి తన వద్ద నుండి 5 లక్షలు తీసుకున్నాడని, ఉద్యోగం గూర్చి రెండు సంవత్సరాలుగా అడుగుతున్న ఎలాంటి సమాధానం లేకపోగా మాపై దూషణకు పాల్పడుతూ బెదిరిస్తున్నాడని న్యాయం చేయమని ఫిర్యాదు.
⏩ గన్నవరం నుండి 70 సంవత్సరాల వృద్ధుడు వచ్చి తనకు ఇద్దరు కుమారులు ఉండగా, ఇరువురికి వివాహం జరిగిందని, తన భార్య మరణించినప్పటి నుండి కొడుకులెవ్వరు భోజనం కూడ పెట్టకుండా ఇబ్బంది పెడుతున్నారని, ఆస్తి మొత్తం వారి పేర రాసి ఇంటి నుండి వెళ్లిపోవాలని బెదిరిస్తున్నారని, శారీరక దాడికి పాల్పడుతున్నారని న్యాయం చేయమని ఫిర్యాదు.
⏩మరిన్ని ఫిర్యాదులు కుటుంబ కలహాలు, సరిహద్దు వివాదాలు, భార్యాభర్తల గొడవలు, ఇతర సమస్యలపై ఫిర్యాదులు రాగా వాటిని సంబంధిత పోలీస్ అధికారులకు బదిలీ చేయడం జరిగింది.