ఇరిగేషన్ పనులు ఎవరికి ఎరికో?

 ఇరిగేషన్ పనులు ఎవరికి ఎరికో? 



విజయనగరం జిల్లా, వంగర మండలం, మద్దివలస సీతారాంపురం పక్క నుంచి వంగర పొలాలకు వెళుతున్న తోటపల్లి రిజర్వాయర్ కాలువ పనులు సీతారాంపురం దగ్గర సక్రమంగా జరగలేదని రైతులు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు 


పై విషయమై ఇరిగేషన్ జేఈ వెంకటరమణ గారికి సీతారాంపురం రైతు బలగ బుల్లి బాబు పలుమార్లు చెప్పినప్పటికీ పని జరగని సమక్షంలో మీడియా వారిని ఆశ్రయించడం జరిగింది 


మిగతా కాల్వ పనులు జరిగినట్లయితే మా ప్రదేశాల వద్ద నీరు నిలువ ఆ నీరు మా ఇండ్లలోకి మరియు మా పశువులు కట్టిన సాలల్లోకి వస్తాయని తమ ఆవేదన వ్యక్తపరిచారు


పై విషయమై ఇరిగేషన్ జేఈ వెంకటరమణ గారిని వివరణ కోరగా పని జరిగిన సమయంలో నేను లేనని బదులిస్తూ పని జరగని ప్రదేశాన్ని కాంట్రాక్టర్ తో మాట్లాడి పనిచేయిస్తానని ఫోను ద్వారా తెలియపరిచారు