శ్రీకర రియల్ ఎస్టేట్ కార్యాలయాన్ని ప్రారంభించిన మాజీ ఎంపీ సినీ నటులు మురళీమోహన్
*శ్రీకర రియల్ ఎస్టేట్ కార్యాలయాన్ని ప్రారంభించిన మాజీ ఎంపీ సినీ నటులు మురళీమోహన్*
న్యూస్ నైన్ ఎన్టీఆర్ జిల్లా విజయవాడ
5/9/25
విజయవాడ,గురుణానక్ కాలనీ లో శ్రీకర రియల్ ఎస్టేట్ కార్యాలయాన్ని ప్రారంభించిన మాజీ ఎంపీ,సినీ నటులు మురళీ మోహన్, జబర్దస్త్ ఫేమ్ వర్ష, శ్రీకర రియల్ ఎస్టేట్ సి ఎం డి దేవినేని సుధీర్.
ఈ సందర్భంగా మురళీమోహన్, వర్ష , దేవినేని సుధీర్లు మాట్లాడుతూ జీవితంలో బిజినెస్ కి అవ్వాలనేదే కల అని,కిసాన్ ఇంజనీరింగ్ బిజినెస్ ప్రారంభించామన్నారు.100 రూపాయలతో జీతం తో జీవితం ప్రారంభించానని,
శోభన్ బాబు ఇచ్చిన సలహాతో భూమి పై పెట్టుబడి పెట్టానన్నారు.హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ ప్రారంభించి లాభాలు సాధించామని, ల్యాండ్ కొనే ముందు భవిష్యత్తులో జరిగే అభివృద్ధి వివరాలు తెలుసుకోవాలన్నారు.
రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ నీతిగా నిజాయితీగా ఉంటే అభివృద్ధి చెందుతారని,అమరావతి ఈ పాటికి అభివ్రుద్ది చెందాల్సిన అవసరం ఉందని,గత ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో అమరావతి నీ అభివృద్ధి చెందనివలేదని, దేశానికి ఒకే రాజధాని ఉందని,
రాష్ట్రానికి కూడా ఒకే రాజధాని ఉండాలన్నారు. ప్రస్తుతం ప్రజల్లో చైతన్యం వచ్చిందని,
కూటమి ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వస్తే రాష్ట్రం మరింత అభివ్రుద్ది చెందుతుందన్నారు.రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు తప్ప నష్టాలు ఉండవన్నారు.
చాలా కష్టపడి కింద నుండి పైకి వచ్చానని, నాలుగు వెంచర్లు పూర్తిచేసి ఐదో వెంచర్లోకి అడుగుపెడుతున్నామని, ఈ శ్రీకర ఆఫీసు ను ప్రారంభించడానికి వచ్చిన మురళీమోహన్ కు ధన్యవాదాలు తెలుపుతున్నానని సీఎండి సుధీర్ తెలిపారు.
మా తల్లిదండ్రులు మురళి మోహన్ చెప్పిన ప్రకారం భూమి మీద పెట్టుబడి పెట్టడం వలన వల్లే ఈరోజు ఆనందంగా ఉన్నామని జబర్దస్త్ ఫేమ్ వర్ష తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీకరా రియల్ ఎస్టేట్ డెవలపర్స్ సిబ్బంది, ఏజెంట్స్, తదితరులు పాల్గొన్నారు.

Comments
Post a Comment