డూండీ గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో అన్నసమారాధన – పోలీసుల పటిష్ట బందోబస్తు

 న్యూస్ నైన్ వెబ్  ఛానల్ ఎన్టీఆర్ జిల్లా విజయవాడ 










డూండీ గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో అన్నసమారాధన – పోలీసుల పటిష్ట బందోబస్తు

📍 ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ – 06/09/2025


విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని విద్యాధరపురంలో డూండీ గణేష్ సేవా సమితి 72 అడుగుల మహా మట్టి గణపతి మేనేజ్‌మెంట్ కమిటీ ఆధ్వర్యంలో అన్నసమారాధన కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి వేలాదిమంది భక్తులు హాజరై, భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు.


ఈ సందర్భంగా ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండీ రాకేష్ స్వయంగా పర్యవేక్షించి, వచ్చిన భక్తులందరికీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్నసమారాధనను విజయవంతంగా పూర్తి చేశారు.


కార్యక్రమం కారణంగా మెయిన్ రోడ్డుపై ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ట్రాఫిక్ ఏసీపీ రామచంద్రరావు, సీఐ సురేష్, ఎస్‌ఐ ఆంజనేయులు ఆధ్వర్యంలో పోలీసులు సమర్థవంతంగా ట్రాఫిక్‌ను నియంత్రించారు. అదే విధంగా, లా అండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తకుండా లా అండ్ ఆర్డర్ ఏసీపీ దుర్గారావు, సీఐ ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో ఎస్సైలు, కానిస్టేబుళ్లు కఠిన భద్రతా ఏర్పాట్లు చేశారు.


అదేవిధంగా, ఈ రోజు జరిగే గణేష్ నిమజ్జనం దృష్ట్యా ఉదయం నుంచి రాత్రి వరకు పోలీస్ శాఖ పటిష్ట బందోబస్తు కల్పించింది.

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

ఫ్లాష్ ఫ్లాష్..... ఘోర రోడ్డు ప్రమాదం

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,