ఆటో కార్మికులు ఆకలి కేకలు పట్టించుకోని కూటమి ప్రభుత్వం

 *ఆటో కార్మికులు ఆకలి కేకలు పట్టించుకోని కూటమి ప్రభుత్వం*






న్యూస్ నైన్ ఛానల్ ఎన్టీఆర్ జిల్లా విజయవాడ


5/9/25


- ప్రమాణాలు ఉల్లంఘించి ఆటో కార్మికుల పొట్ట కొడుతున్న  రాపిడ్, ఓలా, ఉబర్ బైక్ సర్విస్ లు , 


    ఆటో కార్మికుల ఆకలి కేకలు పట్టించుకోని కూటమి ప్రభుత్వం, ఎన్నికల హామీలో భాగంగా ఆటో డ్రైవర్లు కి రూ. 15000లు ఇవ్వాలని, ఓలా, ఉబర్, రాపిడ్ సర్వీస్ రద్దు చేయాలని కూటమి ప్రభుత్వాన్ని ఎం. రామకృష్ణ డిమాండ్ చేశారు. ఇప్టూ అనుబంధ సంఘం ప్రగతిశీల ఆటో కార్మిక సంఘం ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్ లో శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఐఎఫ్ టి యు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.రామకృష్ణ మాట్లాడుతూ  రాష్ట్ర వ్యాప్తంగా ఆటో రంగంపై ఆధారపడి జీవిస్తున్న కార్మికులు రోడ్డున పడ్డారని విమర్శించారు.  రాపిడ్, ఓలా, ఉబర్ బైక్ సర్విస్ లు ఎటువంటి ప్రమాణాలు పాటించడం కూడా సర్వీస్ కంపెనీలు తమ ఆదాయం పెంచుకుంటూ ఆటోవాలా పొట్ట కొడుతున్నప్పటీకి  ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని, 15 వేలు ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి 14 నెలలు అవుతున్నా ఆ‌టో రంగంపై సమీక్ష చేయకపోవడం దురదృష్టకరం అన్నారు. అధిక పెనాల్టీ లు వేసే జీవో 21ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మహిళలకు ఫ్రీ బస్సు ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ద్వారా ఇంధనం, సిఎన్ జి గ్యాస్ ఆటో కార్మికులకు అందించాలని కూటమి ప్రభుత్వాన్ని కోరారు. ఆటో కార్మికులు సమస్యలపై ఈ నెల 18 ఛలో విజయవాడ కార్యక్రమంలో ఆటో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని ఆటో కార్మికులకు ఎం .రామకృష్ణ పిలుపు నిచ్చారు.

      ఈ కార్యక్రమంలో ఇప్టూ జిల్లా అధ్యక్షుడు కె.వి. రమణ, నగర అధ్యక్షుడు రవీంద్ర, ప్రగతి శీల ఆటో కార్మిక సంఘం నగర కార్యదర్శి ఆర్. కనకరావు, నాని, అర్జున్, సత్యనారాయణ, రామచంద్రరావు, పెద్దిరాజు, వెంకటేష్, జి.కోటేశ్వరరావు, అరుణోదయ శ్రీను, లెనిన్, మీరావలి, భాస్కర్, రాజు, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,

వరద బాధితుల కోసము విశాఖపట్నం & అనకాపల్లి ఎక్స్ పారామిలటరీ (CAPF)సర్వీసు మెన్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపున Rs. 25,000/-