కరేడులో స్వచ్ఛందంగా భూ సేకరణ
*కరేడులో స్వచ్ఛందంగా భూ సేకరణ ఇప్పటికే 500 ఎకరాలు సేకరించాం రెవెన్యూ మినిస్టర్ అనగానే సత్యప్రసాద్*
న్యూస్ నైన్ ఛానల్:అమరావతి
18.9.2025
అనగాని సత్యప్రసాద్, రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖామాత్యులు
శాసనమండలిలో గురువారం కరేడు భూముల సేకరణపై సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చిన రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్
పారిశ్రామిక హబ్ ను ఏర్పాటుచేయాలనే లక్ష్యంతో రైతుల నుండి భూములను సేకరణభూసేకరణ కారణంగా ఉపాధి కోల్పోయే కుటుంబాలకు ఉపాధిని కల్పించే బాధ్యత ప్రభుత్వానిదే
పారిశ్రామిక హబ్ ఏర్పాటు ద్వారా వచ్చే ఉద్యోగఅవకాశాల్లో స్థానికులకే మొదటి అవకాశాలుకరేడులో మొత్తం ఇండోసోల్ కంపెనీ ఏర్పాటుచేయబోయే పారిశ్రామిక హబ్ కు 8,200 ఎకరాలు సేకరిస్తున్నాం.
రైతులను ఒప్పించి భూసేకరణ చేస్తున్నాం ఇప్పటికే 500 ఎకరాలు ఇచ్చేందుకు రైతులు లిఖిత పూర్వకంగా అంగీకారం
పారిశ్రామిక హబ్ ఏర్పాటు ద్వారా తమ ప్రాంత రూపురేఖలు మారతాయని రైతులు నమ్మారు
నిజమైన పారిశ్రామికాభివృద్ధిని సాధించేందుకు మా సిఎం చంద్రబాబు కృషి చేస్తున్నారు.
కియా పరిశ్రమ రావడంతో అనంతపురం జిల్లా అభివృద్ధిలో పరుగులు తీసింది.వాన్ పిక్ ప్రాజెక్ట్ వచ్చి ఉంటే తమ జిల్లా అయిన బాపట్ల కూడా ఎంతో అభివృద్ధి చెంది ఉండేది రేపటి రోజున కరేడు ప్రాంతం రూపురేఖలు కూడా మారిపోతాయి.
పరిశ్రమలు స్థాపించి ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉధ్దేశ్యంతోనే భూ సేకరణ చేస్తున్నాం.
నా బంధువులకో, నా స్నేహితులకో పరిశ్రమలు ఇవ్వడం లేదన్నారు.
వేరోకరి పరిశ్రమలను, ఫ్యాక్టరీలను లాక్కునే ప్రభుత్వం తమది కాదు
Comments
Post a Comment