షాపులపై పర్యవేక్షణ కట్టుదిట్టం చేయాలి
**పల్నాడు–గుంటూరు జిల్లాల్లో మెడికల్ షాపులపై పర్యవేక్షణ కట్టుదిట్టం చేయాలి — మానవ హక్కుల సంస్థ డిమాండ్**
గుంటూరు:
ఔషధాల నాణ్యత, ప్రజల ఆరోగ్య భద్రత పట్ల మరింత జాగ్రత్త వహించాలని మానవ హక్కుల స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వాన్ని కోరాయి. శనివారం గుంటూరులోని ఔషధ నియంత్రణ సహాయ సంచాలక కార్యాలయంలో అడిషనల్ డైరెక్టర్ డి. లక్ష్మణ్‌ను నేషనల్ ఫండమెంటల్ లీగల్ రైట్స్ వైస్ ప్రెసిడెంట్ ఏ. రాంబాబు, మానవ హక్కుల సంస్థ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిర్రా రాజేష్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా వారు పల్నాడు, గుంటూరు జిల్లాల్లోని మెడికల్ షాపులు ప్రభుత్వం నిర్ణయించిన నిబంధనలు పాటిస్తున్నాయో లేదో పర్యవేక్షణను బలోపేతం చేయాలని విజ్ఞప్తి చేశారు. కొంతమంది వ్యక్తులు వ్యక్తిగత విభేదాల కారణంగా తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారని, వాటిని విచారణ జరిపి నిజానిజాలు బయటపెట్టాలని సూచించారు.
ప్రజల్లో మెడికల్ షాపులపై నమ్మకం పెంపొందించే దిశగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, మందుల సరఫరాలో పారదర్శకత ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజా ఆరోగ్య పరిరక్షణ కోసం ఔషధ నియంత్రణ శాఖ తరచుగా తనిఖీలు నిర్వహించి, నియమాలు ఉల్లంఘించిన షాపులపై కఠిన చర్యలు తీసు

Comments
Post a Comment