ప్రతి ఒక్కరూ వినియోగదారుల హక్కులపై అవగాహన కలిగి ఉండాలి.
వినియోగదారుల హక్కుల పై ప్రజలకు అవగాహన కల్పిస్తున్న వినియోగదారుల సంఘం సభ్యులు
ప్రతి ఒక్కరూ వినియోగదారుల హక్కులపై అవగాహన కలిగి ఉండాలి.
వస్తువులు కొనుగోలు చేసే ప్రతి కొనుగోలుదారుడు ఒక వినియోగదారుడైననీ కన్జ్యూమర్ రైట్ ప్రొటెక్షన్ ఫోరం పల్నాడు జిల్లా అధ్యక్షులు మురికిపూడి ప్రసాద్ అన్నారు. మంగళవారం పట్టణంలోని
కూరగాయల మార్కెట్, నిత్యవసర వస్తువులు దుకాణాల వద్ద, గడియారపు స్తంభం వద్ద వినియోగదారులు కరపత్రాలు పంపిణీ చేసి వారి హక్కుల గురించి తెలియచేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న crpfi
పల్నాడు జిల్లా అధ్యక్షులు డాక్టర్ విద్యాసాగర్ మాట్లాడుతూ వినియోగదారుల రక్షణ చట్టం 2019 నీ వినయకధాలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ప్రభుత్వం కూడా ఈ మేరకు వినియోగదారులు హక్కులు కల్పించడం ప్రచారాలు చేయాలని చెప్పి ఆయన కోరారు. వినియోగదారుల తమ సమస్యలు ఏమైనా ఉంటే 1915కి లేదా నేషనల్ కన్జ్యూమర్ ఫోరం వెబ్సైట్ను సంప్రదించి తమ సమస్యల్లో పొందుపరిచి పరిష్కరించుకోవచ్చు అని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి రవి నాయక్, జాయింట్ సెక్రెటరీ విక్రమ్, గాలయ్య తదితరులు పాల్గొన్నారు.

Comments
Post a Comment