శాఖా గ్రంథాలయ వారోత్సవాలు
*చిలకలూరిపేట న్యూస్ 9
శాఖా గ్రంథాలయం, మురికిపూడి లో
*ఉత్సాహంగా కొనసాగుతున్న గ్రంధాలయ వారోత్సవాలు
శాఖా గ్రంథాలయం మురికిపూడి నందు 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో నాలుగోవ రోజు సందర్భంగా పాల్గొన్న ఎం. పి. పి. ఎస్. హెచ్. మరియు ఎం. పి. పి. ఎస్. సి. సి. పాఠశాలల విద్యార్థినీ విద్యార్థుల చేత ముందుగా గ్రంథాలయ ప్రతిజ్ఞ చేయించి తదుపరి ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎం. పి. పి. ఎస్. సి. సి. ప్రధానోపాధ్యాయులు శ్రీ మందపాటి చిన్నయ్య గారు మాట్లాడుతూ ప్రతి ఆటకు కొన్ని నియమాలు ఉంటాయి. వాటిని పాటించడం ద్వారా విద్యార్థులలో క్రమశిక్షణ అలవడుతుంది. ఇది వారి భవిష్యత్తులో కూడా ఉపయోగపడుతుందిని. ఆటలలో విజయాలు సాధించడం లేదా మెరుగుపడటం వల్ల విద్యార్థులలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అని తెలియజేశారు.
అనంతరం వారి ఆధ్వర్యంలో 3, 4 మరియు 5వ తరగతి వారికి మ్యూజికల్ చైర్స్ పోటీలు నిర్వహించడమైనది.
ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాల విద్యార్థిని విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామ ప్రజలు మరియు గ్రంథాలయ సిబ్బంది పాల్గొన్నారు

Comments
Post a Comment