🇮🇳 రాజ్యాంగ దినోత్సవం శుభాకాంక్షలు! 🇮🇳

🇮🇳 రాజ్యాంగ దినోత్సవం శుభాకాంక్షలు! 🇮🇳



ప్రియమైన తల్లిదండ్రులారా... భావి భారత పౌరుల నిర్మాణ శిల్పులారా...


ఈ రోజు మన దేశానికి అత్యంత పవిత్రమైన రోజు – భారత రాజ్యాంగ దినోత్సవం!


కానీ... కేవలం శుభాకాంక్షలు చెప్పుకుని సరిపెడదామా?

మన గొంతు మూగబోయిందా? 😔

ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోండి!

 * మీ పిల్లల విద్య హక్కును – దేశ భవిష్యత్తును – మీ కళ్ల ముందే దూరం చేస్తుంటే...

 * రాజ్యాంగం నిర్దేశించిన ఆదేశిక సూత్రాలు – ఉచిత, నిర్బంధ విద్య ఆశయాలు – అటకెక్కుతుంటే...

 * విద్య చట్టాలు కాగితాలకే పరిమితమై, అమలుకు నోచుకోకుంటే...

 * జ్ఞానాన్ని అమ్మకపు వస్తువుగా మార్చి, విద్యతో బహిరంగ వ్యాపారం చేస్తుంటే...

మీరెందుకు మౌనంగా ఉన్నారు?

ఈ రాజ్యాంగం మీకిచ్చిన అత్యంత విలువైన ఆయుధం – ప్రశ్నించే హక్కు!

మీరు ఈ హక్కును ఎందుకు కోల్పోయారు? ఎందుకు వదులుకున్నారు?

ప్రశ్నించండి!

భయం వీడండి! స్వార్థం వదిలేయండి!

మీ ఒక్కరి బిడ్డ కోసం కాదు, రేపటి సమాజం కోసం, దేశ భవిష్యత్తు కోసం...

🔥 ధైర్యంగా నిలబడండి! గట్టిగా అడగండి! 🔥

ఓ తల్లి గా ఓ తండ్రి గా..

 రాజ్యాంగం సాక్షిగా... మన పిల్లల భవిష్యత్తు సాక్షిగా...

విద్య హక్కు చట్టాలను అమలు అమలు కోసం..

ప్రశ్నించండి... ప్రశ్నించండి... ఇది మీ హక్కు! ఇది మన బాధ్యత!




ది పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (PAAP)


రాజ్యాంగం కల్పించిన హక్కుల కోసం !

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,

ఫ్లాష్ ఫ్లాష్..... ఘోర రోడ్డు ప్రమాదం