చిలకలూరిపేట వాసవి క్లబ్ కి అవార్డుల పంట

 చిలకలూరిపేట న్యూస్9: చిలకలూరిపేట వాసవి క్లబ్ కి అవార్డుల పంట



చిలకలూరిపేట వాసవి క్లబ్ (768) కు పలు అవార్డులు దక్కాయి. క్లబ్ అధ్యక్షుడు అయిత ప్రసాద్ చేసిన వినూత్న ఆలోచనతో  క్లబ్ జిల్లా స్థాయిలో 10 అవార్డులతో ప్రథమ స్థానంలో నిలిచింది. 

క్లబ్ సభ్యులకు సంబంధించి వారి పుట్టినరోజు, పెళ్లిరోజు ప్రత్యేకంగా వారి ఇంటికి వెళ్లి దంపతులను కూర్చోబెట్టి వారికి శుభాకాంక్షలు తెలియజేయటం వంటి వినూత్న కార్యక్రమాల ద్వారా  క్లబ్ కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి.

అయిత ప్రసాద్ నాయకత్వంలో వెంట ఉండి నడిచిన అందరు కృషికి తగిన ఫలితం లభించిందని క్లబ్ సభ్యులు తెలిపారు. స్థానిక వాసవి జ్ఞాన మందిరంలో గురువారం జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పట్టణ ఆర్యవైశ్య ప్రముఖులు క్లబ్ సభ్యులు అభినందించారు.

ఈ కార్యక్రమంలో క్లబ్ సెక్రటరీ కొత్తమాసు  పూర్ణచంద్రరావు, ట్రెజరర్ శనగపల్లి వెంకటేశ్వరరావు, రీజియన్ చైర్మన్ రాచుమల్లు అనిల్ కుమార్, జిల్లా సెక్రటరీ పోతుగంటి రమేష్, జిల్లా కోశాధికారి వెల్లంపల్లి కేశవరావు, DPRO మద్ది అప్పారావు తదితరులు పాల్గొన్నారు

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

ఫ్లాష్ ఫ్లాష్..... ఘోర రోడ్డు ప్రమాదం

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,