ప్రజా సమస్యల పరిష్కార వేదిక

 *పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించిన పల్నాడు జిల్లా ఎస్పీ  B.కృష్ణా రావు ఐపిఎస్ .* 



★ ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుండి కుటుంబ, ఆర్ధిక,ఆస్తి తగాదాలు,మోసం మొదలగు ఆయా సమస్యలకు సంబంధించి 111 ఫిర్యాదులు అందాయి.


★ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా వచ్చిన ఫిర్యాదులకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి త్వరితగతిన పరిష్కరించడానికి కృషి చేయాలని  ఎస్పీ  సూచించారు.


★ చిలకలూరిపేట మండలం కావూరు గ్రామానికి చెందిన ఫిర్యాది డ్వాక్రా గ్రూప్ యానిమేటర్ గా పనిచేస్తున్నట్లు, ఆమెకు చిలకలూరిపేట లోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నందు అకౌంట్ ఉన్నట్లు,ఫిర్యాది ఖాతా నుండి 99,500/- రూపాయలు  వేరే ఖాతా కు బదిలీ అయినట్లు బ్యాంక్ వారు తెలిపినట్లు, కావున తన ప్రమేయం లేకుండా వేరే ఖాతాకు బదిలీ అయిన విషయం గురించి విచారణ చేసి న్యాయం చేయవలసిందిగా  ఎస్పీ ని కలిసి అర్జీ ఇవ్వడం జరిగింది. 


★ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలోఎస్పీ తో పాటు అదనపు ఎస్పీ (అడ్మిన్) JV. సంతోష్  హాజరు అయినారు.

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,

ఫ్లాష్ ఫ్లాష్..... ఘోర రోడ్డు ప్రమాదం