గురుకుల పాఠశాల పనుల ఆలస్యం ఆగ్రహ వ్యక్తం చేసిన బి.శ్రీను నాయక్.
చిలకలూరిపేట న్యూస్ 9
గురుకుల పాఠశాల పనుల ఆలస్యం ఆగ్రహ వ్యక్తం చేసిన బి.శ్రీను నాయక్.
చిలకలూరిపేట/
గిరిజన గురుకుల పాఠశాల నిర్మాణానికి రూ.4.36 కోట్ల నిధులు ఉన్నా పనులు చేపట్టలేదని ఏపీ గిరిజన సమాఖ్య రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్రీను నాయక్ సోమవారం అధికారులపై మండిపడ్డారు.స్థానిక సీపీఐ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ పనులు వెంటనే ప్రారంభించకపోతే వచ్చే సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు విద్యార్థులతో కలిసి మహాధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. మన్యం జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.పల్నాడు, మన్యం, ఇతర జిల్లాల్లో మౌలిక సదుపాయాలు, రోడ్లు లేక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. నిధులు ఉన్న అధికారులు పనులు చేయడం లేదని డిప్యూటి సి.యం పవన్ కల్యాణ్ చెప్పు తున్నారు. ఓ జి,హరి హర వీరమల్లులాంటి సినిమాల్లో చేసినట్టుగా రియల్ గా ఎందుకు అధికారుల చేత పని ఎందుకు చేయించటము లేదని నాయక్ ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఫ్ పట్టణ కన్వీనర్ బి.రాంబాబు ఉన్నారు.

Comments
Post a Comment