పల్నాడు జిల్లా కలెక్టర్ కు 5వ ర్యాంక్
పల్నాడు జిల్లా కలెక్టర్ కు 5వ ర్యాంక్
కాకతీయ, కలెక్టరేట్ ప్రతినిధి: పల్నాడు జిల్లా కలెక్టర్ శ్రీమతి కృతికా శుక్లా కు 5వ ర్యాంక్ వరించింది. పల్నాడు కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన కృతికా శుక్లా అతి తక్కువ కాలంలోనే మంచిపేరు సంపాదించారు. వివిధ శాఖల ఫైల్స్ ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నారు. సెప్టెంబర్ 9వ తేదీ నుంచి డిసెంబర్ 9వ తేదీ వరకు ఆమె 110 ఫైల్స్ స్వీకరించారు. అందులో 73 క్లియర్ చేశారు. సగటున ఒక్కో ఫైల్ క్లియర్ చేయడానికి ఒక రోజు 3గంటల సమయం తీసుకున్నారు. దీంతో ఫైల్స్ క్లియరెన్స్ లో కలెక్టర్ కి సీఎం చంద్రబాబు 5వ ర్యాంకు ఇచ్చారు.

Comments
Post a Comment