సామాజిక స్పృహ, సమాజం పట్ల అవగాహన కలిగిన ఆదర్శ జర్నలిస్ట్ మస్తాన్ వలి*

 *సామాజిక  స్పృహ, సమాజం పట్ల అవగాహన కలిగిన ఆదర్శ జర్నలిస్ట్ మస్తాన్ వలి*



*ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన జర్నలిస్ట్ మస్తాన్ వలి ని సత్కరించిన సీపీఐ నాయకులు* 


సామాజిక స్పృహ, సమాజం పట్ల అవగాహన కలిగిన ఆదర్శ జర్నలిస్ట్ మస్తాన్ వలి అని సీపీఐ ఏరియా కార్యదర్శి తాళ్లూరి బాబురావు అన్నారు. ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన సందర్భంగా మస్తాన్ వలి నీ   సీపీఐ కార్యాలయంలో ద్దుశాలువా, పూలమాల వేసి ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ మస్తాన్ వలి జర్నలిస్ట్ గానే కాకుండా సేవ కార్యక్రమాల్లో ముందుంటారని  అన్నారు.జర్నలిస్టుల సమస్యల మీద దృష్టి సారించి వాటి పరిష్కారానికి కృషి చేసి జర్నలిజానికి వన్నె తేవాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి చెరుకుపల్లి నిర్మల,AIYF పల్నాడు జిల్లా కార్యదర్శి షేక్ సుభాని,ఎఐటియుసి కార్యదర్శి దాసరి వరహాలు,వేలూరు గ్రామ సిపిఐ కార్యదర్శి ఏలికా శ్రీనివాసరావు, ఏరియా కౌన్సిల్ సభ్యులు CR సృజన్, నాయకులు కొండల రావు,నానా, మంత్రూ నాయక్,కరిముల్ల తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

ఫ్లాష్ ఫ్లాష్..... ఘోర రోడ్డు ప్రమాదం

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,