సెల్ ఫోన్ లైట్ల వెలుగులలో ఖననం మున్సిపాలిటీ నిర్లక్ష్యం
*సెల్ ఫోన్ లైట్ల వెలుగులలో ఖననం*
సౌకర్యాలు లేమిలో ముస్లింల ఖబ్రస్థానం*
*మున్సిపాలిటీ నిర్లక్ష్యం
నరసరావుపేట, డిసెంబర్ 15
చీకటి కప్పిన రాత్రి వేళల్లో, సెల్‌ఫోన్ లైట్లు మాత్రమే వెలుగు కాంతిగా మార్చుకుని, పార్దిపదేహాన్ని ఖననం చేయాల్సిన పరిస్థితి. ఇది ఎక్కడో మారుమూల ప్రాంతంలో జరిగిన సంఘటన కాదు. పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని ముస్లిం ఖబ్రస్థానం వద్ద జరుగుతున్న హృదయవిదారక దృశ్యం. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ పవిత్ర స్థలం చీకటి, మురికి, అసౌకర్యాల మధ్య పడిపోయిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఎన్నోసార్లు సౌకర్యాలు కల్పించాలని మున్సిపాలిటీ అధికారులకు విన్నపాలు చేసినా చర్యలు లేవని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఖబ్రస్థానం వద్ద రాత్రి ప్రార్థనల తర్వాత జరిగే అంత్యక్రియల సమయంలో, విద్యుత్ సౌకర్యం లేకపోవడం వల్ల ప్రజలు బాధపడుతున్నారు. "మా తల్లిదండ్రులు, స్నేహితులు మమ్మల్ని వదిలి వెళ్లిన తర్వాత కనీసం శాంతిగా వారి స్మృతులకు సమాధి చేయాలి. కానీ ఇక్కడ చీకటి మధ్య సెల్‌ఫోన్ లైట్లు పట్టుకుని మట్టి చేయాల్సి వస్తోంది. ఇది మన హృదయాలను బాధిస్తోంది," అని స్థానిక ముస్లిం సమాజ నాయకులు తెలిపారు. అతని కుటుంబం గత వారం ఒక స్నేహితుడి అంత్యక్రియలో పాల్గొన్నప్పుడు ఈ పరిస్థితిని ఎదుర్కొంది. "చీకటిలో మట్టి చేసుకున్నామని అన్నారు.
స్థానిక ముస్లిం సమాజం నుంచి ఎన్నోసార్లు మున్సిపల్ అధికారులకు విన్నపాలు చేశారు. "మేము మున్సిపల్ కమిషనర్‌కు, ఎమ్మెల్యేకు, కలెక్టర్‌కు లిఖిత ఫిర్యాదులు చేశాం. కానీ ఎట్టి ప్రయోజనం లేదు. ఖబ్రస్థానం గోడలు, వెలుగు సౌకర్యాలు కోరాం. ఇప్పటికీ అధికారులు నిశ్శబ్దంగా ఉన్నారు," అని ఎంఐఎం నాయకులు తెలిపారు.
నరసరావుపేట మున్సిపల్ అధికారులు ఈ విషయంపై స్పందించాల్సిన అవసరం ఉంది పలు ముస్లిం సంఘాలు దీనిపై దృష్టి పెట్టి, సహాయం చేస్తామని తెలిపాయి. "ఇది కేవలం ముస్లిం సమాజ సమస్య కాదు, మానవత్వానికి సంబంధించినది. ప్రభుత్వం త్వరగా చర్యలు తీసుకోవాలి," అని నాయకులు పిలుపునిచ్చారు. ఈ ఘటన మత సామరస్యం, మానవీయ విలువల గురించి పునర్చింతన చేయమని గుర్తుచేస్తోంది.

Comments
Post a Comment