ప్రైవేట్ ట్రావెల్స్ వసూలు చేస్తున్న అధిక ధరలను నియంత్రించాలి
ప్రైవేట్ ట్రావెల్స్ వసూలు చేస్తున్న అధిక ధరలను నియంత్రించాలి రవాణా శాఖ అధికారికి వినియోగదారుల హక్కుల పరిరక్షణ ఫోరం నాయకుల వినతి
పండుగలు మరియు ప్రత్యేక రోజుల్లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల యాజమాన్యాలు వినియోగదారుల వద్ద నుంచి ఊహించని విధంగా అత్యధిక ధరలు వసూలు చేస్తున్నారు అని, ట్రావెల్స్ మరియు ఆర్టీసీ తో పోల్చుకుంటే ఆర్టీసీ కంటే నాలుగు రెట్లు అదనంగా పెంచుతున్నారు అని, టికెట్ ధరలను నియంత్రణ చేయాలని కన్స్యూమర్ రైట్ ప్రొటెక్షన్ ఫోరం, ప్రజా సంఘాల నాయకులు శుక్రవారం చిలకలూరిపేట రవాణా శాఖ అధికారి గోపాల్ కు వినతి పత్రాన్ని అందించారు. అదేవిధంగా స్కూల్ బస్సులను తనిఖీ చేయాలని, ఫిట్నెస్ లేని బస్సులను ఆపివేసే విధంగా చర్యలు తీసుకోవాలనీ వారు కోరారు. అనంతరం వినియోగదారుల సంఘం పల్నాడు జిల్లా అధ్యక్షుడు మురికిపూడి ప్రసాద్ మాట్లాడుతూ ధరలు పెంచేందుకు ఒక ప్రాతిపదిక ఉండాలని, ప్రాతిపదిక లేని పక్షంలో ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఇస్తానుసారంగా ధరలు పెంచుకుంటే వినియోగదారులు నష్టపోతున్నారని, ఆర్టీసీ బస్సులు కేవలం 50% పెంపుతో నడుపుతున్నారు అని అన్నారు. రవాణా శాఖ అధికారులు దీనిపై వినియోగ దారులకు అవగాహన కూడా కల్పించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి రవి నాయక్, కోశాధికారి బేబీ విక్రమ్, ఏపీ గిరిజన సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర నాయకుడు బి శ్రీను నాయక్, ప్రైవేట్ టీచింగ్ ప్రొఫెషనల్స్ నాయకులు చెన్నకేశవుల రాంబాబు, ఏవైఎఫ్ పట్టణ కన్వీనర్ బి రాంబాబు నాయక్ తదితరులు పాల్గొన్నారు

Comments
Post a Comment