వాటర్ బాటిల్ ధర అడిగినందుకు వినియోగదారుడు తల పగలగొట్టడం దారుణం
మురికిపూడి ప్రసాద్
కన్జ్యూమర్ రైట్ ప్రొడక్షన్ ఫోరం పల్నాడు జిల్లా అధ్యక్షుడు
శబరిమలలో వాటర్ బాటిల్ ధర అడిగినందుకు వినియోగదారుడు తల పగలగొట్టడం దారుణం : ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి
మురికిపూడి ప్రసాద్, వినియోగదారుల సంఘం పల్నాడు జిల్లా అధ్యక్షుడు
కేరళ రాష్ట్రం శబరిమలలో
వాటర్ బాటిల్ ధర ఎక్కువగా అమ్ముతున్నాడని ఇదేమిటిని ప్రశ్నించిన వినియోగదారులపై దాడి చేయటం దుర్మార్గమని పలనాడు జిల్లా వినియోగదారుల సంఘం అధ్యక్షుడు ప్రసాద్ అన్నారు. వినియోగదారులకు రక్షణ చట్టం 2019 వస్తువులు కొనుగోలు చేసి వినియోగదారులకు అనేక హక్కులు కల్పించిందని, ఏ వస్తువునైనా బేరం ఆడి కొనుగోలు చేసే హక్కు వినియోగదాలకు ఉందని, ఎమ్మార్పీ కంటే తక్కువ అడగటం నేరం కాదని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఆర్టీసీ బస్టాండ్ మొదలుకొని, దేవాలయాలు, ప్రయాణికులు, యాత్రికులు వెళ్లేచోట అన్ని వస్తువులు ఇష్టానుసారంగా అమ్ముతున్నప్పటికీ సంబంధిత అధికారులు ఎక్కడ దాడులు చేసిన సందర్భాలు లేవని ఆయన అన్నారు. ప్రభుత్వ అధికారులు వినియోగదారులకి రక్షణ కల్పించకపోతే ఆయా అధికారులపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ధర అడిగినంత మాత్రాన
దాడులకు పాల్పడితే వినియోగదారులకు రక్షణ ఏముందని ఆయన ప్రశ్నించారు.

Comments
Post a Comment